మాస్క్ పరోటా తయారు చేసిన హోటల్ యజమాని.. ఎందుకంటే..

Mask Parotta: కరోనా కారణంగా మధురై జిల్లా అంతా లాక్‌డౌన్‌లో ఉండటంతో... ప్రజలకు మాస్క్‌లుపై మరింత అవగాహన కల్పించేందుకే ఈ రకరమైన పరోటా మాస్క్ తయారు చేశారని తెలిపాడు.

news18-telugu
Updated: July 8, 2020, 8:40 PM IST
మాస్క్ పరోటా తయారు చేసిన హోటల్ యజమాని.. ఎందుకంటే..
మాస్క్ ఆకారంలో పరోటా
  • Share this:
కరోనా మన జీవితాల్లోకి వచ్చిన తరువాత మాస్క్ అనేది మన జీవితంలో ఓ భాగమైపోయింది. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరిగా మారిపోయింది. ప్రధాని, ముఖ్యమంత్రులు సైతం తమ రోజూవారీ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో మాస్క్‌లు ధరిస్తున్నారు. ఇక మాస్క్‌లు ధరించని వారి పట్ల ప్రభుత్వం కూడా కఠినంగానే వ్యవహరిస్తోంది. వారికి జరిమానాలు విధిస్తోంది. అయితే ఇంత చేస్తున్నా కొందరు మాత్రం మాస్క్ ధరించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కరోనా సంక్షోభ సమయంలో మాస్క్‌ గురించి మరింత అవగాహన కల్పించేందుకు తమిళనాడు మధురైకు చెందిన హోటల్ నిర్వహకుడు కె.ఎల్ కుమార్ మాస్క్ ఆకారంలో ఉన్న పరోటాను తయారు చేశాడు. కరోనా కారణంగా మధురై జిల్లా అంతా లాక్‌డౌన్‌లో ఉండటంతో... ప్రజలకు మాస్క్‌లుపై మరింత అవగాహన కల్పించేందుకే ఈ రకరమైన పరోటా మాస్క్ తయారు చేశారని తెలిపాడు.

Published by: Kishore Akkaladevi
First published: July 8, 2020, 8:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading