news18-telugu
Updated: November 26, 2020, 3:23 PM IST
ప్రతీకాత్మక చిత్రం
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. చాలా దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. భారత్‌లో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రాత్రి పూట లాక్డౌన్, కర్ఫ్యూ విధిస్తున్నారు. దిల్లీలో కోవిడ్ కేసులు ఏమాత్రం తగ్గట్లేదు. దీంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు వాడాలని నియమ నిబంధనలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉచితంగా మాస్కులు అందించాలనే ఉద్దేశంతో మాస్కు బ్యాంకును ప్రారంభించారు నార్త్ దిల్లీ మేయర్. సెంట్రల్ దిల్లీలోని సదర్ బజార్ వద్ద నార్త్ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జై ప్రకాష్ బుధవారం 'మాస్క్ బ్యాంక్' ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
* బరాతుటి చౌక్ వద్ద ప్రరంభించిన మాస్క్ బ్యాంక్‌ను నార్త్ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, దిల్లీ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. మాస్కు అవసరం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే, ఈ బ్యాంకుల్లో వాటిని ఉచితంగా తీసుకోవచ్చని అధికారులు చెప్పారు. ఫేస్ కవర్లు డొనేట్ చేయాలనుకునేవారు ఈ సెంటర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
* జరిమానాకు దూరంగా
నార్త్ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, దిల్లీ పోలీసులు సంయుక్తంగా ఇలాంటి మరిన్ని మాస్కు బ్యాంకులను అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలు, మార్కెట్లు, సందర్శకులు ఎక్కువగా వచ్చే ప్రాంతాలు, పేదల నివాసాలు ఉండే బస్తీల వద్ద వీటిని ఏర్పాటు చేయనున్నారు. దిల్లీలో మాస్కు ధరించకుండా బయటకు వెళ్తే రూ.2000 జరిమానా విధిస్తారు. అసలే ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, పేదలు జరిమానా బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉచితంగా మాస్కులను అందించే ప్రయత్నం చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ జై ప్రకాశ్ వివరిస్తున్నారు.
* ప్రతి వార్డులోనూ బ్యాంకు
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందువల్ల మాస్కులు తప్పనిసరిగా ధరించాలని దిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీని ఉల్లంఘనకు గతంలో ఉన్న జరిమానాను రూ.500 నుంచి రూ.2,000కు పెంచింది. "COVID-19 నుంచి ప్రజలను రక్షించడమే మా లక్ష్యం. మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో మొత్తం 104 ఉచిత మాస్క్ బ్యాంకులను ఏరియా కౌన్సిలర్ల సహాయంతో అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం" అని మున్సిపల్ కమిషనర్ ప్రకాష్ తెలిపారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 26, 2020, 3:20 PM IST