స్టాక్ మార్కెట్లు గురువారం కూడా భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1652 పాయింట్లు నష్టపోయి 27217 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అటు నిఫ్టీ సైతం కీలకమైన 8000 పాయింట్ల దిగువన ప్రారంభమైంది. నిఫ్టీ ప్రారంభంలోనే 500 పాయింట్లు నష్టపోయి 7967 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 1321 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 20 పాయింట్ల దిగువకు పతనమైంది. ఐటీ స్టాక్స్ కూడా భారీగా నష్టపోతున్నాయి. నిఫ్టీ ఐటీ సూచీ 4.7 శాతం నష్టపోయింది. స్టాక్స్ పరంగా చూస్తూ HDFC Bank, HDFC, Bajaj Finance, Kotak Mahindra, Reliance భారీగా నష్టపోయాయి. టాప్ లూజర్లుగా Bharti Infratel, ONGC, Bajaj Finance, IndusInd Bank, Bharti Airtel స్టాక్స్ 15 నుంచి 11 శాతం మేర నష్టపోయాయి.
కరోనా నేపథ్యంలో ప్రపంచ మార్కెట్స్ భారీగా గ్లోబల్ రిసెషన్ నుంచి గ్లోబల్ డిప్రెషన్ వైపు కదులుతున్నాయి. ఆసియా మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ కనిష్ట స్థాయిని తాకాయి. షాంఘై కాంపోజిట్ సూచీ 2.14 శాతం నష్టపోగా, నిక్కీ 1.85 శాతం నష్టపోయింది. ఇక యూఎస్ మార్కెట్స్ డో జోన్స్ ఏకంగా 6.30 శాతం నష్టపోగా, ఎస్ అండ్ పీ 5.18 శాతం నష్టపోయింది. నాస్డాక్ సూచీ కూడా 4.70 శాతం నష్టపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Business Ideas, Coronavirus, Stock Market