Arogya Sanjeevani Policy: గుడ్ న్యూస్... ఆరోగ్య సంజీవని పాలసీ వచ్చేసింది

Arogya Sanjeevani Policy: గుడ్ న్యూస్... ఆరోగ్య సంజీవని పాలసీ వచ్చేసింది

Arogya Sanjeevani Policy: గుడ్ న్యూస్... ఆరోగ్య సంజీవని పాలసీ వచ్చేసింది (image: ManipalCigna)

Arogya Sanjeevani Policy | ఐఆర్‌డీఏఐ రూపొందించిన 'ఆరోగ్య సంజీవని పాలసీ' అందుబాటులోకి వచ్చింది. ఈ పాలసీతో ఉపయోగాలేంటో తెలుసుకోండి.

  • Share this:
    మార్కెట్‌లో అనేక రకాల హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలు ఉన్నాయి. కానీ... తక్కువ ధరలో, ముఖ్యమైన వైద్య సేవలతో ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI 'ఆరోగ్య సంజీవని పాలసీ' పేరుతో స్టాండర్డ్ హెల్త్ కవర్ పాలసీని రూపొందించింది. భారతదేశంలోని 29 ఇన్స్యూరెన్స్ కంపెనీలు 2020 ఏప్రిల్ 1న ఆరోగ్య సంజీవని పాలసీని ప్రారంభించాలని ఆదేశించింది. మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఆరోగ్య సంజీవని పాలసీని ప్రకటించింది. ఇతర కంపెనీలు కూడా ఈ పాలసీని ప్రారంభించాల్సి ఉంది. ఈ పాలసీకి సంబంధించిన ఉపయోగాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    మణిపాల్‌సిగ్నా ఆరోగ్య సంజీవని పాలసీలో రూ.1 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు హెల్త్ కవర్ లభిస్తుంది. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ కుటుంబ సభ్యులు కలిపి ఈ పాలసీ తీసుకుంటే 15 శాతం డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. అదనంగా ఆన్‌లైన్ రెన్యువల్ డిస్కౌంట్ ఏడాదికి 3 శాతం లభిస్తుంది. కరోనావైరస్ లాంటి ఇన్ఫెక్షన్ వ్యాధులకు కూడా ఈ పాలసీ వర్తించడం విశేషం. ఆధునిక చికిత్సలు, వైద్య ప్రక్రియలు దాదాపుగా ఈ పాలసీలో కవర్ అవుతాయి. ప్రీహాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్, ఆయుష్ ట్రీట్మెంట్ కూడా ఈ పాలసీలో ఉంటుంది. ఈ పాలసీకి సంబంధించిన ఉపయోగాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    Covid 19: ఇమ్యూనిటీ ఇలా పెంచుకోండి... ఆయుర్వేదిక్ ఫార్ములా చెప్పిన నరేంద్ర మోదీ

    EMI payment: హోమ్ లోన్ ఈఎంఐ వాయిదా వేస్తే రూ.2.34 లక్షల నష్టం... ఈ లెక్క చూడండి

    Jio Plans: రిలయెన్స్ జియో ప్రకటించిన కొత్త ప్లాన్స్ ఇవే...
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు