ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్

ప్రస్తుతం సుమలత హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ సలహాతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ప్రజలందరి ఆశీర్వాదంతో..త్వరలోనే కరోనా నుంచి బయటపడతానని ఆమె చెప్పారు.

news18-telugu
Updated: July 6, 2020, 6:33 PM IST
ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్
సుమలత (Twitter/Photo)
  • Share this:
మన దేశంలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు, సినీ, క్రీడా ప్రముఖులు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా.. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. ఐతే ఒక ఎంపీగా తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించిన సుమలత.. కరోనా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే శనివారం ఆమెకు తలనొప్పి, గొంతు నొప్పి రావడంతో అనుమానం వచ్చి.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దానికి సంబంధించి రిపోర్ట్ ఇవాళ రాగా.. అందులో కరోనా పాజిటివ్ వచ్చింది.

ప్రస్తుతం సుమలత హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ సలహాతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ప్రజలందరి ఆశీర్వాదంతో..త్వరలోనే కరోనా నుంచి బయటపడతానని ఆమె చెప్పారు. ఇటీవల తాను కలిసిన వారందరి వివరాలను అధికారులు వెల్లడంచానని తెలిపారు. వారంతా వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, సుమలత తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ చిత్రాల్లో నటించారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న బతుకు జట్కా బండి కార్యక్రమానికి కొన్ని రోజుల పాటు హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా లోక్‌సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. జేడీఎస్ అభ్యర్థి, దేవెగౌడ మనవడు నిఖిల్‌పై గెలిచి..పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.
Published by: Shiva Kumar Addula
First published: July 6, 2020, 6:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading