హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

100 రోజుల తర్వాత ఇంటికి వస్తున్న మంచు విష్ణు భార్యా పిల్లలు

100 రోజుల తర్వాత ఇంటికి వస్తున్న మంచు విష్ణు భార్యా పిల్లలు

100 రోజుల తర్వాత ఇంటికి వస్తున్న మంచు విష్ణు భార్యా పిల్లలు

100 రోజుల తర్వాత ఇంటికి వస్తున్న మంచు విష్ణు భార్యా పిల్లలు

విష్ణు భార్య విరానికా తన పిల్లలతో కలిసి మార్చిలో సింగపూర్‌కు వెళ్లారు. ఐతే వారు సింగపూర్ వెళ్లిన తర్వాత.. సింగపూర్‌, ఇండియాతో పాటు పలు దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అంతర్జాతీయ విమానా సర్వీసులను నిలిపివేశాయి. దాంతో వారు అక్కడే చిక్కుకుపోయారు.

ఇంకా చదవండి ...

  కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను విడదీసింది. లాక్‌డౌన్‌తో ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోవడం.. ఇంటికి వెళ్లే పరిస్థితి లేకపోయింది. ఇక విదేశాలకు వెళ్లిన వారి పరిస్థితైతే మరీ దారుణం. దేశీయ విమానాలు తిరుగుతున్నా.. అంతర్జాతీయ విమానాలు మాత్రం ఇప్పట్లో తిరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ చేపట్టింది. పలు దేశాలకు ప్రత్యేక విమానాలను తరలిచించి మనోళ్లకు తీసుకొస్తున్నారు. దాంతో లాక్‌డౌన్‌లో విదేశాల్లో చిక్కుకుపోయిన వారంతా ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు.

  తాజాగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు భార్య విరానికా, ఆయన పిల్లలు కూడా వందే భారత్ మిషన్‌లో భాగంగా స్వదేశానికి వస్తున్నారు. సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఈ విషయాన్ని విష్ణు భార్య విరానికా ట్విటర్ ద్వారా తెలిపారు. విమానంలో మాస్క్‌లు ధరించి కూతుళ్లతో దిగిన ఫొటోలను షేర్ చేసింది. వంద రోజుల తర్వాత సింగపూర్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్లేందుకు సహకరించిన వందే భారత్ మిషన్, ఎయిర్ ఇండియా, సింగపూర్ బృందానికి కృతజ్ఞతలు. అని విరానికా పేర్కొన్నారు. ఆ ట్వీట్‌ను మంచు విష్ణ రిట్వీట్ చేశారు.


  కాగా, విష్ణు భార్య విరానికా తన పిల్లలతో కలిసి మార్చిలో సింగపూర్‌కు వెళ్లారు. ఐతే వారు సింగపూర్ వెళ్లిన తర్వాత.. సింగపూర్‌, ఇండియాతో పాటు పలు దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అంతర్జాతీయ విమానా సర్వీసులను నిలిపివేశాయి. దాంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. ఐతే విదేశాల్లో ఉన్న వారిని వందే భారత్ మిషన్ ద్వారా కేంద్రం ప్రభుత్వం స్వస్థలాలకు చేరుస్తోంది. అందులో భాగంగానే సింగపూర్ నుంచి వస్తున్న విమానంలో విరానికా, ఆమె పిల్లలు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Lockdown, Singapore, Telugu Movie News, Tollywood

  ఉత్తమ కథలు