కరోనా నుంచి కాపాడుకునేందుకు ‘మన ఆరోగ్య ఆయుష్ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్’

మన ఆరోగ్య ఆయుష్ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్

ల్యాబ్‌క్యూబ్, ఐఎన్సీ-యూఎస్ఏ భాగస్వామ్య సంస్థ అయిన ల్యాబ్‌క్యూబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. ‘మన ఆరోగ్య ఆయుష్ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్’ను గతేడాది డిసెంబర్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు.

  • Share this:
    కరోనా నేపథ్యంలో వ్యాధినిరోధకతను పెంచుకోవడం అత్యవసరమైన నేపథ్యంలో.. నగరానికి చెందిన ల్యాబ్‌క్యూబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ‘మన ఆరోగ్య ఆయుష్ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్’లో మరో మూడు కొత్త రుచులను (మింట్, పైనాపిల్, మిక్స్‌డ్ ఫ్రూట్) మంగళవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. కరోనాతోపాటు ఇతర వైరస్‌ల బారినుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు.. భారతీయ సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదానికి వివిధ రుచులను జోడించి వ్యాధినిరోధకత పెంచుకునేలా ప్రోత్సహించేందుకే మరిన్ని రుచులను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ల్యాబ్‌క్యూబ్, ఐఎన్సీ-యూఎస్ఏ భాగస్వామ్య సంస్థ అయిన ల్యాబ్‌క్యూబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. ‘మన ఆరోగ్య ఆయుష్ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్’ను గతేడాది డిసెంబర్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు.

    వినియోగదారుల ఇంటివద్దకే వీలైనంత త్వరగా ‘మన ఆరోగ్య ఆయుష్ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్’ చేరేలా వివిధ ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థలతో ల్యాబ్‌క్యూబ్ సంస్థ కలిసి పనిచేస్తోంది. ఈ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్‌ ఒక బాటిల్ ధర 73 రూపాయలకు అందుబాటులో ఉండగా.. రేషన్ కార్డు ఉన్నవారికి రూ. 55కే దొరుకుతోంది.త్వరలోనే ఈ ఉత్పత్తులను మెడికల్ దుకాణాలు, కిరాణా దుకాణాలు, అమెజాన్ వంటి ప్రధాన ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ల ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ల్యాబ్‌క్యూబ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, సీఈవో శ్రీనివాస్ మనప్రగడ వెల్లడించారు.

    కరోనా నేపథ్యంలో ప్రజల వ్యాధినిరోధక శక్తి పెరగాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వినూత్నమైన ఆయుర్వేద ఫార్ములాతో వివిధ ఉత్పత్తులకు రూపకల్పన చేశామని తీసుకొస్తున్నట్లు ల్యాబ్‌క్యూబ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, సీఈవో శ్రీనివాస్ మనప్రగడ తెలిపారు. తీవ్రమైన వైరస్‌లను కూడా తట్టుకునేలా వివిధ మూలికలతో ఈ ఉత్పత్తులను రూపొందించామని అన్నారు. ల్యాబ్‌క్యూబ్ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ అనుమతి కూడా లభించిందని... ప్రస్తుతానికి నేరుగా వినియోగదారులకు ఇంటివద్దకే మా ఉత్పత్తులను చేరవేస్తున్నామని అన్నారు.

    మన ఆరోగ్య ఆయుష్ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్‌ను ప్రదర్శిస్తున్న ల్యాబ్‌క్యూబ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, సీఈవో శ్రీనివాస్ మనప్రగడ


    రెండోదశ కరోనా నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. త్వరలోనే వివిధ వేదికల ద్వారా మరింతగా ల్యాబ్‌క్యూబ్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. కరోనా నియంత్రణలో విజయవంతంగా పనిచేస్తున్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఉపయోగిస్తున్న ఫార్ములా, తమ ఫార్ములా ఒకటేనని శ్రీనివాస్ మనప్రగడ వెల్లడించారు. కానీ ల్యాబ్‌క్యూబ్ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్.. ఔషధేతర ఆయుర్వేద సప్లిమెంట్లుగానే అనుమతులు పొందిందని.. ఇవి ప్రజలకు ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుందనిఆయన తెలిపారు.

    కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఈ ఉత్పత్తులను వినియోగించవచ్చని, దీంతోపాటు మార్కెట్‌లోని ఇతర వస్తువులతో పోలిస్తే తక్కువ ధరకే ప్రజలకు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. వందశాతం సహజసిద్ధమైన పధార్థాలతో రూపొందించిన ఇమ్యూనిటీ బూస్టర్ల ద్వారా సాధారణ ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కునే శక్తితోపాటు శ్వాసనాళ ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కునే సామర్థ్యం పెరుగుతుంది.

    ఈ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్ వల్ల ప్రధానమైన ఉపయోగాలు:
    1. వ్యాధినిరోధక శక్తిపెరుగుతుంది
    2. యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది
    3. వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది
    4. శ్వాసనాల సంబంధిత సమస్యలు రాకుండా తోడ్పడుతుంది
    5. రోజువారి వినియోగం ద్వారా ఆరోగ్యకరమైన శారీరక బరువు నిర్వహణ సాధ్యమవుతుంది
    6. వందశాతం సహజసిద్ధ పధార్థాలతో తయారీ
    7. ఒక్కో షాట్‌లో 60 ఎంఎల్ ఔషధం ఉంటుంది. వైద్యుల సూచన మేరకు 30 ఎంఎల్ చొప్పున రెండుసార్లు వేసుకోవచ్చు.
    8. 18 షాట్స్, 36 షాట్స్ ప్యాక్‌లు అందుబాటులోఉన్నాయి.

    వినియోగదారుల కోరిక మేరకు మరింత ఎక్కువ షాట్స్‌తో ప్యాక్‌ చేసి ఇవ్వగలమని శ్రీనివాస్ మనప్రగడ తెలిపారు. ఈ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్‌కు యూఎస్ ఎఫ్‌డీఏ, ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) భారత ప్రభుత్వ ఆయుష్ విభాగం అనుమతులు ఉండటంతోపాటు ఐఎస్‌వో 22000 సర్టిఫికేషన్ కూడా ఉందని వివరించారు. ల్యాబ్‌క్యూబ్ గురించి మరిన్ని వివరాలు https://labcube.in/లో తెలుసుకోవచ్చని తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published: