Corona Virus: కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య...

తనకు కరోనా వచ్చిందనే భయంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆ వ్యక్తి... ఐసోలేషన్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

news18-telugu
Updated: April 2, 2020, 11:30 AM IST
Corona Virus: కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా మహమ్మారి ప్రజలను శారీరకంగా హింసించడంతోపాటు మానసికంగానూ తీవ్ర క్షోభకు గురి చేస్తోంది. కరోనా లక్షణాలతో ఆస్పత్రులు, ఐసొలేషన్ వార్డుల్లో చేరిన చాలామంది... తమకు కరోనా సోకిందా ? లేదా అనే అంశంతో తెగ మానసిక వేదనకు గురవుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి... తనకు కరోనా వచ్చిందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్రంలో షామ్లీ పట్టణానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకిందనే అనుమానంతో రెండు రోజులుగా ఐసోలేషన్ వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు అధికారులు. అతడి రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. అయితే తనకు కరోనా వచ్చిందనే భయంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆ వ్యక్తి... ఐసోలేషన్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిప్రెషన్ కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్టు వైద్యులు తెలిపారు.




Published by: Kishore Akkaladevi
First published: April 2, 2020, 11:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading