Hyderabad: కరోనా వ్యాక్సిన్ స్టాక్ లేదని నర్సుపై దాడి.. టీకా కోసం ఇంకెన్ని దారుణాలు చూడాలో..

ప్రతీకాత్మక చిత్రం

మిగతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపైనా రాజేశ్ విరుచుకుపడ్డాడు. అసభ్య పదజాలంతో దూషించాడు. బాధిత నర్సు పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

  • Share this:
    మన దేశంలో మే 1 నుంచి మూడో దశ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేస్తామని కేంద్రం తెలిపింది. టీకాలు వేసుకోదలచుకున్న వారు కోవిన్ పోర్టల్‌లో రిజర్ట్ చేసుకోవాలని చెప్పింది. ఈ క్రమంలోనే టీకాల కోసం జనాలు ఎగబడుతున్నారు. ఇప్పటి వరకు 3 కోట్ల మందికిపైగా రిజిస్టర్ చేసుకున్నారు. కానీ అందుకు సరిపడా టీకాలు ఎక్కడా లేవు. చాలా రాష్ట్రాలు 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ఇంకా ప్రారంభించలేదు. మొదటి డోస్ తీసుకున్న వారికే రెండో డోసు అందుబాటులో లేదు. వ్యాక్సిన్ కొరతతో చాలా రాష్ట్రాల ప్రజలుఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ కోసం గొడవలు కూడా జరుగుతున్నాయి. వ్యాక్సిన్ స్టాక్ లేదని చెప్పినందుకు.. నర్సుపై ఓ వ్యక్తి దాడి చేశాడు. హైదరాబాద్‌లో ఈ ఘటన జరిగింది.

    గచ్చిబౌలికి చెందిన రాజేశ్ (24) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. టీకా కోసం ఇటీవలే కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నాడు. అనంతరం స్లాట్ ప్రకారం.. ఖైరతాబాద్‌లోని వెల్‌నెస్ కేంద్రానికి బుధవారం సాయంత్రం 04.14కు టీకా వేయించుకునేందుకు వచ్చాడు. ఐతే సమయం ముగిసిందని అక్కడున్న నర్సు మంజుల చెప్పింది. తాను స్లాట్ బుక్ చేసుకున్నానని.. టీకా ఎందుకు ఇవ్వరని నిలదీశాడు. ఇక్కడ టీకా నిల్వలు లేవని.. స్టాక్ అయిపోయిందని ఆ నర్సు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. టీకాలు లేకపోతే తాము ఏమీ చేయలేమని..దయచేసి అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఐనా అతడు వినలేదు. ఆమెను ఫోన్‌తో వీడియో తీసే ప్రయత్నం చేశాడు. వీడియో తీయవద్దని అడ్డుకోవడంతో.. నర్సు చెయ్యి పట్టుకొని, ముఖాన్ని నెట్టివేశాడు.

    ఈ ఘటనలో నర్సు మంజుల నోటి భాగంలో గాయమయింది. మిగతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపైనా రాజేశ్ విరుచుకుపడ్డాడు. అసభ్య పదజాలంతో దూషించాడు. బాధిత నర్సు పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వ్యాక్సినేషన్ సిబ్బందిపై దాడిని నిరసిస్తూ గురువారం విధులు బహిష్కరించనున్నట్లు నర్సులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఖైరతాబాద్ వెల్‌నెస్ కేంద్రంలో టీకాల పంపిణీకి అంతరాయం ఏర్పడింది. కాగా, ఏపీ, తెలంగాణలోనూ చాలా చోట్ల టీకాలు అందుబాటులో లేవు. 18ఏళ్లు నిండి వారికి ఇప్పట్లో టీకాలు ఇవ్వడం సాధ్యం కాదని.. కొంత సమయం పడుతుందని ఇప్పటికే ప్రభుత్వం వెల్లడిచంింది.
    Published by:Shiva Kumar Addula
    First published: