ఇంజెక్షన్ వేస్తానని చెప్పి రేప్ చేశాడు.. కరోనా రోగిపై నర్సు అత్యాచారం.. అంతలోనే విషాదం

ఇంజెక్షన్ వేస్తానని చెప్పి రేప్ చేశాడు.. కరోనా రోగిపై నర్సు అత్యాచారం.. అంతలోనే విషాదం

ప్రతీకాత్మక చిత్రం

మృతురాలు 1984 భోపాల్‌ గ్యాస్‌ విషాదంలో ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ మహా విషాదం నుంచి తప్పించుకున్న ఆమె కరోనా బారినపడి.. అనంతరం నర్సు చేతిలో అత్యాచారానికి గురై మరణించింది.

 • Share this:
  కోవిడ్ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. రోగులకు సేవ చేస్తూ వారి ప్రాణాలు కాపాడాల్సిన నర్సు కామాంధుడిగా మారాడు. రాత్రివేళ కోవిడ్ వార్డులోనే ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం కొన్ని గంటల్లోనే బాధితురాలు మరణించింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘోరం జరిగింది. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారారం.. 43 ఏళ్ల ఓ మహిళ కరోనాతో బాధపడుతూ ఏప్రిల్ 6న భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చేరింది. అదే రోజు రాత్రి ఆ వార్డులో నర్సుగా పనిచేసే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు.ఇంజెక్షన్ వేయాలని నిద్రలేపి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్పటికే శ్వాస సమస్యలతో ఇబ్బందుపడుతున్న ఆమె పరిస్థితి మరింత విషమించింది. అనంతరం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. ఘటన జరిగిన 24 గంటల్లోనే ఆమె మరణించింది.

  ఘటన జరిగిన రోజే ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం నిందితుడు సంతోష్‌ అహివార్‌ (40)ని అరెస్ట్ చేశారు. అతడు అండర్ ట్రయల్ ఖైదీ భోపాల్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఇంత జరిగినా ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు. సోషల్ మీడియాలో వార్త వైరల్ కావడంతో దీని గురించి బయట సమాజానికి తెలిసింది. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని.. అక్కడ భద్రతా పరమైన లోపాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.

  ఐతే నిందితుడు గతంలోనూ ఓ నర్సుపై అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మద్యం సేవించి 24 ఏళ్ల స్టాఫ్ నర్సుపై అత్యాచారం చేయడంతో సస్పెండ్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. మృతురాలు 1984 భోపాల్‌ గ్యాస్‌ విషాదంలో ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ మహా విషాదం నుంచి తప్పించుకున్న ఆమె కరోనా బారినపడి.. అనంతరం నర్సు చేతిలో అత్యాచారానికి గురై మరణించింది. కాగా, మధ్యప్రదేశ్‌లో గురువారం 8,419 కొత్త కరోనా కేసులు వచ్చాయి. 10,157 మంది కోలుకోగా.. మరో 74 మంది మరణించారు. తాజా లెక్కలతో మధ్యప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,08,621కి చేరింది. ప్రస్తుతం అక్కడ 1,08,116 యాక్టివ్ కేసులున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు