కరోనా పరీక్షలపై కేంద్రానికి సుప్రీం కోర్టు కీలక సూచన..

సుప్రీం కోర్టు కేంద్రానికి కీలక సూచన చేసింది. కరోనా పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్‌లలో కూడా ఫీజు వసూలు చేయకుండా చూడాలని సూచించింది.

news18-telugu
Updated: April 8, 2020, 1:24 PM IST
కరోనా పరీక్షలపై కేంద్రానికి సుప్రీం కోర్టు కీలక సూచన..
సుప్రీం కోర్టు
  • Share this:
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశమంతా హైఅలర్ట్ అయ్యింది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే చాలు.. ప్రభుత్వమే దగ్గరుండి మరీ పరీక్షలు చేయించి, చికిత్స అందిస్తోంది. అయితే.. ఈ మధ్యే ప్రైవేట్ ల్యాబ్‌లకు కూడా టెస్ట్ చేసే అవకాశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ ల్యాబ్‌లలో ఫీజు వసూలు చేస్తున్నారు. రూ.4500 ఖర్చుతో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కేంద్రానికి కీలక సూచన చేసింది. కరోనా పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్‌లలో కూడా ఫీజు వసూలు చేయకుండా చూడాలని సూచించింది. ప్రస్తుతం ప్రభుత్వ ల్యాబ్‌లలో మాత్రమే కరోనా టెస్ట్‌లు ఉచితంగా నిర్వహిస్తున్నారని, ప్రైవేట్ ల్యాబ్‌లలోనూ ఉచితంగా పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది.

‘కరోనా టెస్టులకు ప్రైవేట్ ల్యాబ్‌లు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోకుండా చూడాలి. ప్రైవేట్ ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకుంటే రీయింబర్స్‌మెంట్‌ వచ్చేలా చేయాలి’ అని జడ్జి అశోక్ భూషణ్, ఎస్ రవీంద్ర భట్‌లతో కూడిన న్యాయస్థానం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.

First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading