మహేష్ బాబు భారీ విరాళం.. ఇంట్లోంచి రావొద్దంటూ సూచనలు..

Mahesh Babu: కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భారీగానే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 26, 2020, 3:37 PM IST
మహేష్ బాబు భారీ విరాళం.. ఇంట్లోంచి రావొద్దంటూ సూచనలు..
మహేష్ బాబు (Mahesh Babu new movie)
  • Share this:
కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భారీగానే విరాళం అందించాడు. ఈ మధ్యే సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంచలన విజయం అందుకున్న ఈయన.. సాయంలో కూడా సరిలేరు అనిపించుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఏకంగా కోటి రూపాయల విరాళం అందించాడు సూపర్ స్టార్. దాంతో పాటు కరోనా వైరస్ అరికట్టడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న చర్యలపై ప్రశంసల వర్షం కురిపించాడు మహేష్.

ఓ బాధ్యత గల వ్యక్తిగా ఇంట్లోంచి కాలు బయటికి పెట్టకూడదని.. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దంటూ కోరాడు మహేష్ బాబు. అందరూ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాలని.. 21 రోజులు ఇంట్లోనే ఉండాలని కోరాడు సూపర్ స్టార్. అందరూ లాక్ డౌన్ రూల్స్ పాటిద్దామంటూ లెటర్ విడుదల చేసాడు. మానవత్వం గెలుస్తుంది.. కచ్చితంగా ఈ యుద్ధంలో మనం విజయం సాధిస్తామంటూ తెలిపాడు మహేష్ బాబు. మనకు మనమే రక్షణగా ఉండాల్సిన సమయం వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు మహేష్ బాబు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు