మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా ప్రభంజనం...

మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 9518 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: July 19, 2020, 9:06 PM IST
మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా ప్రభంజనం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
మహారాష్ట్రలో కరోనా ప్రభంజనం సృష్టిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 9518 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. ఈ రోజు నమోదైన వాటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 310455కు పెరిగింది. గత 24 గంటల్లో 258 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 11,854కి చేరింది. ఇక ముంబైలోనే కొత్తగా 1038 కరోనా కేసులు నమోదయ్యాయి. ముంబైలో మొత్తం కేసుల సంఖ్య 101388కి పెరిగింది.

ఇక కర్ణాటక లో కూడా భారీ ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4120 కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసులు వచ్చాయి. వీటితో కలిపి కర్ణాటకలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 63772కి పెరిగింది. వాటిలో 39370 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రోజు 1290 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు కర్ణాటకలో 91 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1331కి పెరిగింది. మొత్తం కరోనా కేసుల్లో 579 మంది ఐసీయూలో ఉన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 19, 2020, 9:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading