Home /News /coronavirus-latest-news /

MAHARASHTRA GOVERNMENT STARTED CORONA FREE VILLAGE COMPETITION TO CONTROL COVID 19 IN STATE AK

కరోనా కట్టడి కోసం మహారాష్ట్ర వినూత్న ఆలోచన.. గ్రామాలకు సరికొత్త పోటీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maharashtra: దేశంలో కరోనా కారణంగా మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా ఇబ్బందిపడుతున్న మహారాష్ట్రలోనూ కరోనా కేసులు మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి.

    కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రజలు, స్థానిక సంస్థలు కూడా ఈ దిశగా ముందడుగు వేయాలని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా వారిని ప్రొత్సహించేందుకు వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. 50 లక్షల రూపాయల వరకు ప్రైజ్ మనీతో ‘కరోనా ఫ్రీ విలేజ్’ పోటీని ప్రారంభించింది. కరోనాపై అవగాహన కోసమే కాక వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం ఈ పోటీని ప్రారంభిస్తున్నామని సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. కరోనా ఫ్రీ విలేజ్’ పోటీ వైరస్‌ కట్టడి కార్యక్రమంలో ఓ భాగమని రాష్ట్ర మంత్రి తెలిపారు. కరోనా కట్టడిలో విజయవంతమైన మూడు ఉత్తమ గ్రామ పంచాయతీలకు నగదు బహుమతి ఇవ్వబడుతుందని అన్నారు.

    మొదటి బహుమతి కింద 50 లక్షలు, రెండో బహుమతి కింద 25 లక్షలు, మూడో బహుమతి కింద 15 లక్షల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 6రెవెన్యూ విభాగాలు ఉన్నందున మొత్తం 18 బహుమతులు ఉంటాయని, ఇందుకు గాను 5.4 కోట్ల రూపాయలు కేటాయించామని ఆయన తెలిపారు.

    పోటీలో గెలిచిన గ్రామాలకు బహుమతి డబ్బుతో సమానమైన అదనపు మొత్తం ప్రోత్సాహంగా ఇస్తామని తెలిపారు. ఈ డబ్బు గ్రామాల్లోని అభివృద్ధి పనులకు ఉపయోగపడుతుందని వివరించారు. ఇక దేశంలో కరోనా కారణంగా మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా ఇబ్బందిపడుతున్న మహారాష్ట్రలోనూ కరోనా కేసులు మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో అక్కడ లాక్‌డౌన్ ఆంక్షల్లో సడలింపులు ఇస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Corona cases, Maharashtra

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు