మహారాష్ట్రలో లాక్‌డౌన్ ఆంక్షలు పొడిగింపు.. ఎన్ని రోజులంటే..

మహారాష్ట్రలో లాక్‌డౌన్ ఆంక్షలు పొడిగింపు.. ఎన్ని రోజులంటే..

ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్రలో గడిచిన 24గంటల్లో కొత్తగా 46,781 కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 816మరణాలు నమోదయ్యాయి.

  • Share this:
    మహారాష్ట్రలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న ఆంక్షలు మరికొన్ని వారాల పాటు కొనసాగనున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ తరహా ఆంక్షలు ఈ నెల 31 వరకు కొనసాగుతాయని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ విషయంలోనూ ప్రభుత్వం ఆచితూచి ముందుకు సాగాలని భావించింది. ఈ క్రమంలోనే 18-44ఏళ్ల లోపు వయస్సు వారికి వ్యాక్సిన్ ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మే 20తర్వాత 1.5కోట్ల వ్యాక్సిన్ డోసులను అందిస్తామని సీరం సంస్థ అధినేత ముఖ్యమంత్రికి తెలిపారని.. ఆ వ్యాక్సిన్ డోసులు వచ్చిన తరువాత 18-44ఏళ్ల లోపువారికి వాక్సిన్ ఇవ్వడం ప్రారంభిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు.

    ఇదిలా ఉంటే మహారాష్ట్రలో గడిచిన 24గంటల్లో కొత్తగా 46,781 కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 816మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి కొత్తగా 58,805 మంది కోలుకోవడం ఊరట కలిగించే అంశం. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,46,129కి చేరుకోగా.. మరణాల సంఖ్య 78,007కి చేరింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 46,00,196కు చేరుకుంది. కరోనా నియంత్రణలోకి రావాలంటే మరికొద్ది రోజులు లాక్‌డౌన్ కొనసాగించడం ఒక్కటే మార్గమని నిపుణులు, ఐసీఎంఆర్ వంటి సంస్థలు సూచిస్తున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: