హెల్త్‌కేర్ వర్కర్‌పై కేసు నమోదు... 16 మందికి కరోనా అంటించాడని...

దేశం మొత్తం హెల్త్‌కేర్ వర్కర్లను కరోనా వారియర్స్‌గా మెచ్చుకుంటోంది. కీర్తిస్తోంది. మరి అతనిపై కేసు ఎందుకు నమోదు చేశారు. ఇది ఎలా జరిగింది?

news18-telugu
Updated: July 1, 2020, 1:00 PM IST
హెల్త్‌కేర్ వర్కర్‌పై కేసు నమోదు... 16 మందికి కరోనా అంటించాడని...
హెల్త్‌కేర్ వర్కర్‌పై కేసు నమోదు... 16 మందికి కరోనా అంటించాడని... (credit - NIAID)
  • Share this:
మహారాష్ట్ర... ముంబైలో ఈ ఘటన జరిగింది. అసలే అక్కడ రోజూ... వేల కేసులు నమోదవుతున్నాయి. పాల్ఘర్‌లోని వాడా పోలీసులు... ఓ హెల్త్‌కేర్ వర్కర్‌పై కేసు రాశారు. అసలేం జరిగిందంటే... అతని భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ విషయాన్ని అతను దాచిపెట్టాడు. ఆమెను ఇంట్లోనే ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నాడు. ఐతే... రూల్స్ ప్రకారం తను కూడా ఇంట్లోనే క్వారంటైన్ కావాల్సి ఉండగా... అలా చెయ్యకుండా... డ్యూటీ చేస్తున్నాడు. రోజూ ఖానీవాలీలోని హెల్త్ కేర్ సెంటర్‌కి వచ్చి సేవలు అందించాడు. ఐతే... ఎప్పుడు పాకిందో అతనికి కూడా కరోనా పాకింది. అంతే కాదు... అదే సెంటర్‌లో పనిచేస్తున్న మరో 16 మందికి అతని ద్వారా కరోనా సోకింది. ఇప్పుడు మొత్తం 17 మందినీ క్వారంటైన్ చేశారు. ఆ సెంటర్‌లో మొత్తం 25 మంది ఉన్నారు. మిగతా 8 మందీ ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఆ హెల్త్ కేర్ సెంటర్ సరిగా పనిచేసే అవకాశం లేకుండా పోయింది.

తాలులా మెడికల్ ఆఫీసర్... హెల్త్ కేర్ వర్కర్ సంజయ్ బూర్పల్లే నిర్లక్ష్యంగా వ్యవహరించాడని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సంజయ్ భార్య.. థానే సివిల్ ఆస్పత్రిలో నర్సు.

ఈ కేసులో ఓ షాకింగ్ విషయం ఉంది. సంజయ్... రోజూ భార్యతో ఉండట్లేదు. అతను... వాడాలో ఉంటున్నాడు. ఆమె... కల్వాలో ఉంటోంది. జూన్ మొదటివారంలో కల్వా వెళ్లి భార్యను కలిశాడు. ఒక రోజు ఆమెతో ఉన్నాడు. అప్పటికే ఆమె నుంచి టెస్ట్ శాంపిల్స్ సేకరించి పంపాడు. మర్నాడు అతను వాడాకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత టెస్టు రిజల్ట్స్‌లో తనకు కరోనా సోకినట్లుగా ఆమె కాల్ చేసి సంజయ్‌కి చెప్పింది. అప్పుడు అతను ఏం చెయ్యాలి... తన హెల్త్ కేర్ సెంటర్‌కి కాల్ చేసి... విషయం చెప్పి... తను కూడా క్వారంటైన్ అవ్వాలి. కానీ సంజయ్ అలా చెయ్యకుండా... మేటర్ చెప్పకుండా దాచిపెట్టి... హెల్త్ కేర్ సెంటర్‌కి వెళ్లాడు. డ్యూటీయే ముఖ్యం అని అతను అనుకొని ఉండొచ్చు. "భార్యతో ఉన్నది ఒక్క రోజే కదా... నాకు సోకి ఉండదులే" అని అనుకొని ఉండొచ్చు. కానీ... తీవ్ర పొరపాటు జరిగిపోయింది.

హెల్త్ కేర్ సెంటర్‌లో అంతమందికి కరోనా ఎలా సోకిందో దర్యాప్తు జరపగా... సంజయ్ నుంచే సోకినట్లు తేలింది. దాంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 188 కింద, అలాగే... డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సంజయ్... ఐసోలేషన్‌లో ఉన్నాడు.

First published: July 1, 2020, 12:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading