Caronil Controversy | పంతాజలికి మద్రాస్ హైకోర్టు షాక్...భారీ జరిమానా

వ్యవస్థలను బుల్‌డోజ్ చేస్తామంటే కుదరదంటూ పతాంజలి సంస్థపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కరోనిల్’ ఔషధం కరోనా వ్యాధిని నయం చేస్తుందని ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాలను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించినందుకు రూ.10 లక్షల జరిమానా విధించింది.

news18-telugu
Updated: August 7, 2020, 8:44 AM IST
Caronil Controversy | పంతాజలికి మద్రాస్ హైకోర్టు షాక్...భారీ జరిమానా
రాందేవ్ బాబా (ఫైల్ ఫొటో)
  • Share this:
యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన పంతాజలి సంస్థకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల ఆ సంస్థ మార్కెట్లో విడుదల చేసిన ఆయుర్వేద మందుకు ‘కరోనిల్’ బ్రాండ్‌ను వాడటానికి వీల్లేదని తీర్పు ఇచ్చింది. పతాంజలి ‘కరోనిల్’ బ్రాండ్ పేరును వాడుకోవడాన్ని సవాలు చేస్తూ చెన్నైకి చెందిన అర్ధురా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ బ్రాండ్ పేరును తాము ముందుగానే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీలో రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిపింది. కరోనిల్ 92-బీ ట్రేడ్ మార్క్‌ను 2027 వరకు ఎవరూ వాడుకోకుండా 1993 జూన్ మాసంలో తాము రిజిస్టర్ చేయించామని...ఈ బ్రాండ్‌పై తమకే పూర్తి హక్కులు ఉన్నాయని పేర్కొంది.

Patanjali,patanjali corona medicine,ramdev baba,ayush department,coronavirus,covid19,telugu news,పతంజలి,కరోనావైరస్,రాందేవ్ బాబా,కోవిడ్19
కరోనిల్ మందును లాంచ్ చేసిన పతంజలి(ఫైల్ ఫోటో)


పిటిషనర్ వాదనతో ఏకీభవించిన మద్రాస్ హైకోర్టు...పతాంజలి సంస్థ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీలో చెక్ చేసుకోకుండా...రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్‌గా ఉన్న ‘కరోనిల్’ బ్రాండ్ పేరును వినియోగించడం సరికాదని జస్టిస్ సీవీ కార్తికేయన్ పేర్కొన్నారు. ‘కరోనిల్’ బ్రాండ్‌ను పతాంజలి వాడుకోకుండా నిషేధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీలో చెక్ చేసుకోకపోవడం పతాంజలి తప్పిదమన్నారు. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీలో ముందుగా చెక్ చేసుకుని ఉంటే సమస్య ఇక్కడి వరకు వచ్చేది కాదని జడ్జి పేర్కొన్నారు. రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ వ్యవస్థను బుల్‌డోజ్ చేస్తామంటే కుదరని పతాంజలి తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.  ముందుగా ట్రేడ్ మార్క్‌ రిజిస్ట్రీలో చెక్ చేసుకోలేదని కారణంగా చూపుతూ...కరోనిల్ బ్రాండ్‌ను వాడుకునేందుకు అనుమతించాలని కోరడం సరికాదని న్యాయమూర్తి స్పష్టంచేశారు.

madras high court, patanjali ayurved, coronil medicine, baba ramdev news, coronil news, మద్రాస్ హైకోర్టు, పతాంజలి ఆయుర్వేద్, కరోనిల్ ఆయుర్వాద, బాబా రాందేవ్ వార్తలు, కరోనిల్ వార్తలు
మద్రాస్ హైకోర్టు (File)


అలాగే కరోనా వైరస్‌ను నయం చేస్తుందని ప్రచారం చేసుకుని ప్రజల్లో భయాన్ని సొమ్ముచేసుకునేందుకు ప్రయత్నించినందుకు పతాంజలి రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కరోనిల్ మాత్రలు కేవలం దగ్గు, జలుబు, జ్వరం రాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచే మందు మాత్రమేనని...ఎలాంటి అనుమతులు లేకుండా సంక్షోభ సమయంలో ఇది కరోనాను నయం చేస్తుందని ప్రచారం చేసుకున్నందుకు జరిమానా విధిస్తున్నట్లు స్పష్టంచేశారు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా రోగులకు చికిత్స అందిస్తున్న చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, గవర్నమెంట్ యోగా అండ్ నేచురోపతి మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తలా రూ.5 లక్షలు చెల్లించాలని న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు.
Published by: Janardhan V
First published: August 7, 2020, 8:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading