MADHYAPRADESH OFFICIALS DISTENTION FOR VACCINATION THEY GIVE CERTIFICATE VACCINE FOR 13 YEAR OLD NGS
Record tension: రికార్డుల కోసం అధికారుల ఆరాటం.. జాబితాలో 13 ఏళ్ల బాలుడి పేరు.. అసలేం జరిగింది?
రికార్డుల కోసం అధికారుల ఆరాటం
అధికారుల అత్యుత్సాహం అప్పుడప్పుడు విమర్శల పాలవుతుంది. తాజాగా మధ్య ప్రదేశ్ లోని కొందరు అధికారులు రికార్డు స్థాయి వ్యాక్సిన్ పంపిణీ చేశాం అని చెప్పుకోవడం కోసం.. వ్యాక్సిన్ వేయని వారి పేర్లను సైతం జాబితాలో పెట్టడం కలకలం రేపుతోంది.
వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చశామని.. భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్ వేసామని చెప్పుకోడానికి అధికారులు ఆరాట పడుతున్నారు. రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ వేశామని చెప్పుకోడానికి కొన్ని చిల్లర పనులు చేస్తున్న్టటు ఆరోపణలు ఉన్నాయి. గత సోమవారం రాత్రి 7.27 గంటలకు భోపాల్ లో నివాసం ఉంటున్న రజత్ దాంగ్రే ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది. అందులోని సమాచారం ఏంటంటే... రజత్ కుమారుడు వేదాంత్ దాంగ్రేకు కరోనా టీకాను వేసేశారు. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ నుంచి ఈ సమాచారం రాగానే రజత్ అవాక్కయ్యారు. ఇంతవరకూ దేశంలో 18 ఏళ్లకు దిగువన ఉన్న వారికి వ్యాక్సిన్ వేసేందుకు అనుమతులే లేకపోగా, తన కుమారుడికి ఎప్పుడు, ఎక్కడ, ఎవరు వ్యాక్సిన్ వేశారా? అది కూడా తనకు తెలియకుండా అని అయోమయంలో పడ్డాడు.
ప్రభుత్వం నుంచి వచ్చిన మెసేజ్ లో వేదాంత్ వయసు 56 సంవత్సరాలుగా పేర్కొనడం గమనార్హం. ఈ సమాచారాన్ని చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, వెంటనే అందులోని లింక్ ను ఓపెన్ చేసి చూడగా, వ్యాక్సిన్ వేసినట్టు సర్టిఫికెట్ కూడా వచ్చిందని రజత్ తెలిపారు. ఈ విషయమై తాను ఫిర్యాదు చేసేందుకు వెళ్లి విఫలం అయ్యానని, దివ్యాంగుడైన తన కుమారుడికి పెన్షన్ కోసం ఇటీవల మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి, కొన్ని ధ్రువపత్రాలను ఇచ్చానని, వాటిని అధికారులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
ఈ నెల 21న మధ్యప్రదేశ్, వ్యాక్సినేషన్ లో జాతీయ రికార్డును సృష్టిస్తూ, 17.42 లక్షల మందికి టీకాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత చాలా మంది తాము టీకాలు తీసుకోకున్నా, తమ సెల్ ఫోన్లకు టీకా తీసుకున్నట్టు సమాచారం, ఆ వెంటనే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వస్తోందని ఆరోపించారు.
వేదాంత్ దాంగ్రేకు టీకా వేశామని చెప్పిన రోజే, సాత్నా జిల్లాలో ఉండే చినేంద్ర పాండేకు ఐదు నిమిషాల వ్యవధిలో ముగ్గురికి టీకాలు వేసినట్టుగా మెసేజ్ లు వచ్చాయి. ఆ ముగ్గురూ ఎవరో కూడా తనకు తెలియదని అతను ఆరోపించారు. భోపాల్ లోనే ఉండే నుజహత్ సలీమ్ (46)కు ఎటువంటి పెన్షన్ లేకున్నా.. ఆమె పెన్షనర్ అని ప్రూఫ్ చూపుతూ వ్యాక్సిన్ వేసినట్టుగా మెసేజ్ వచ్చి నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీరే కాదు... ఇంకా చాలా మంది ఇటువంటి అనుభవాలనే ఎదుర్కొన్నారు. ఇప్పుడు వీరంతా తాము రెండు డోస్ లను ఎలా పొందాలా? అన్న ఆందోళనలో ఉన్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.