కరోనాను జయించిన సీఎం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి

కరోనా అంత ప్రమాదకరమైన వ్యాధేమీ కాదని.. అలాగని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయని శివరాజ్ సింగ్ అన్నారు. ఏ మాత్రం కరోనా లక్షణాలు కనిపించినా పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు

news18-telugu
Updated: August 5, 2020, 3:58 PM IST
కరోనాను జయించిన సీఎం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
శివరాజ్ సింగ్ చౌహాన్
  • Share this:
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా మహమ్మారిని జయించారు. కోవిడ్19 నుంచి కోలుకున్న ఆయన బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో జులై 25న భోపాల్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు శివరాజ్. 10 రోజుల పాటు అక్కడే చికిత్స పొందారు. ఆస్పత్రిలో తన బట్టలు తానే ఉతుక్కుంటూ సాధారణ మనిషిలా గడిపారు. ఆస్పత్రి నుంచే అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో వారం రోజుల పాటు ఇంట్లోనే ఐసోలేషన్‌లోనే ఉండాలని డాక్టర్లు సూచించారు.

డిశ్చార్జి సందర్భంగా డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు సీఎం శివరాజ్ సింగ్. వారితో కలిసి ఫొటోలు దిగారు. కరోనా అంత ప్రమాదకరమైన వ్యాధేమీ కాదని.. అలాగని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయని శివరాజ్ సింగ్ అన్నారు. ఏ మాత్రం కరోనా లక్షణాలు కనిపించినా పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. కరోనాకు మందు, వాక్సిన్ వచ్చే వరకు భౌతిక దూరమే ఏకైక మార్గమని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు 34,865 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాను జయించి ఇప్పటి వరకు 24,770 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 928 మంది మరణించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో 9,167 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: August 5, 2020, 3:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading