కరోనా సంక్షోభ కాలంలో ఉద్యోగం కోల్పోయారా? ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా జాబ్ రావట్లేదా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో 1.9 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని అంచనా. ఇంకా ఈ సంఖ్య పెరుగుతోంది. అయితే కొన్ని రంగాల్లో మాత్రం ఉద్యోగావకాశాలు బాగానే ఉన్నాయి. డ్యూటీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే పనిచేసుకోవచ్చు. డబ్బు సంపాదించొచ్చు. కాకపోతే అందుకు తగ్గ స్కిల్స్ మీలో ఉండాలి. ఆ స్కిల్స్ ఉంటే చాలు... కూర్చున్న చోటి నుంచే డబ్బు సంపాదించడం సులువు. మరి ఏఏ రంగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు ఉన్నాయో తెలుసుకోండి.
Govt Scheme: జాబ్ పోయిందా? అయినా సగం జీతం తీసుకోవచ్చు... అప్లై చేయండిలా
DRDO Jobs: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో జాబ్స్... పరీక్ష లేకుండా ఉద్యోగం
Instagram Marketing: ఇన్‌స్టాగ్రామ్... కుర్రాళ్లకు ఈ యాప్ గురించి పరిచయం అక్కర్లేదు. మొదట్లో ఫోటో షేరింగ్ యాప్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత అనేక ఫీచర్స్ వచ్చాయి. కస్టమర్ల ఎంగేజ్‌మెంట్ పెంచేందుకు ఇన్‌స్టాగ్రామ్ మార్కెటింగ్‌పై చాలా బ్రాండ్లు ఆసక్తి చూపిస్తున్నాయి. మీకు ఇన్‌స్టాగ్రామ్ మార్కెటింగ్‌పై ఆసక్తి ఉంటే ఈ రంగంలో అవకాశాలు వెతుక్కోవచ్చు.
Social Media Marketing Consultant: అనేక బ్రాండ్స్ సోషల్ మీడియా పేజెస్ నిర్వహించేందుకు బ్రాండ్ మేనేజర్లను నియమించుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఆయా బ్రాండ్స్‌కు రీచ్ పెంచడమే వీరి పని.
Graphic Designer: మీకు ఫోటోషాప్ స్కిల్స్ ఉన్నాయా? అయితే గ్రాఫిక్ డిజైనర్‌గా మంచి అవకాశాలు మీ సొంతం. ఇంటి నుంచే గ్రాఫిక్ డిజైనర్‌గా వర్క్స్ చేయొచ్చు.
SSC Constable Jobs: ఇంటర్ పాసయ్యారా? 5846 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేయండి
ECIL Jobs: బీటెక్ పాసైనవారికి 350 ఉద్యోగాలు... ఈసీఐఎల్-హైదరాబాద్ జాబ్ నోటిఫికేషన్
Blogging: బ్లాగింగ్ ఇటీవల బాగా పేరొచ్చిన ప్లాట్‌ఫామ్. మంచి డిమాండ్ ఉన్న కంటెంట్ రాయడం ద్వారా బ్లాగింగ్‌లో రాణించొచ్చు.
Proofreading: మీకు స్క్రిప్ట్‌లో ఉన్న తప్పుల్ని వెతికే స్కిల్స్ ఉన్నాయా? అయితే మీరు మంచి ప్రూఫ్ రీడర్ అన్నమాట. పుస్తకాలు, ఆర్టికల్స్ రాసేవారు వాటిని ప్రూఫ్ రీడింగ్ చేయిస్తుంటారు. ప్రూఫ్ రీడర్‌గా బాగానే సంపాదించొచ్చు.
Transcribing: ఆడియో ఫార్మాట్‌లో ఉన్నదాన్ని టెక్స్ట్ ఫార్మాట్‌లోకి మార్చడమే ట్రాన్స్‌స్క్రైబింగ్. ఇటీవల దీనికి బాగా డిమాండ్ ఉంది.
ఈ ఉద్యోగాలన్నీ చేయడానికి మీకు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్, స్కిల్స్ ఉంటే చాలు. ఈ ఉద్యోగాలను ఇంటి నుంచే చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Corona, Corona virus, Coronavirus, Covid-19, JOBS, Work From Home