లాక్‌డౌన్ పొడిగిస్తే ఆకలి చావులే...ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి హెచ్చరిక...

మే 3 తర్వాత లాక్డౌన్ కొనసాగితే, కరోనావైరస్ కాకుండా ఆకలి కారణంగా దేశంలో ఎక్కువ మరణాలు సంభవిస్తాయని ఆయన అన్నారు. లాక్ డౌన్ పరిస్థితిని భారత్ తట్టుకోలేదనే కఠిన సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలని ఉందని ఈ సందర్భంగా మూర్తి అన్నారు.

news18-telugu
Updated: April 30, 2020, 2:05 PM IST
లాక్‌డౌన్ పొడిగిస్తే ఆకలి చావులే...ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి హెచ్చరిక...
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
  • Share this:
దేశంలో లాక్‌డౌన్ కారణంగా ఒక నెల కన్నా ఎక్కువ కాలమే అన్ని ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి. దేశ వ్యాప్తంగా 23 మార్చి 2020 నుంచి లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే లాక్‌డౌన్‌ను మే 3 తర్వాత కూడా పొడిగించాలని అటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. పంజాబ్ ఇప్పటికే లాక్ డౌన్ రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కానీ లాక్ డౌన్ మాత్రమే కరోనా కట్టడికి పరిష్కారం కాదని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఓ వెబ్‌నార్‌లో లాక్‌డౌన్ పెంపు దిశగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉందనే అంచనాపై నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.. మే 3 తర్వాత లాక్డౌన్ కొనసాగితే, కరోనావైరస్ కాకుండా ఆకలి కారణంగా దేశంలో ఎక్కువ మరణాలు సంభవిస్తాయని ఆయన అన్నారు. లాక్ డౌన్ పరిస్థితిని భారత్ తట్టుకోలేదనే కఠిన సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలని ఉందని ఈ సందర్భంగా మూర్తి అన్నారు. లాక్ డౌన్‌ పొడిగిస్తే భారతదేశంలో ఆకలితో మరణాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. భారతదేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అభివృద్ధి చెందిన దేశాల కంటే చాలా తక్కువగా ఉందని ఆయన అన్నారు. అలాగే, వైరస్ కారణంగా మరణించే రేటు 2.25 నుండి 0.50 శాతం మాత్రమే ఉందని, భారతదేశంలో వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని ఆయన గుర్తు చేశారు.

ప్రజలు తిరిగి పనుల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, కరోనావైరస్ ఒక కొత్త రకం సాధారణ వైరస్ అనే విషయాన్ని మనం అంగీకరించాలని నారాయణ మూర్తి అన్నారు. భారతదేశంలో కరోనావైరస్ పరీక్షల సంఖ్య చాలా నెమ్మదిగా ఉందని నారాయణ మూర్తి అన్నారు. టీకాలు తయారుచేసే దిశగా భారతీయ స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలు ఆలోచించాలని ఆయన సూచించారు. అలాగే, ప్రభుత్వానికి సలహా ఇస్తూ బిగ్ డేటా అనలిటిక్స్ విశ్లేషణాత్మక ఇన్ పుట్స్ ఆధారంగా లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన తెలిపారు. అంతేకాదు ప్రభుత్వం వాస్తవ పరిస్థితులు ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని తప్ప ఎమోషనల్‌గా నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలని అన్నారు.

భారతదేశంలో కరోనా వైరస్ ద్వారా మాత్రమే కాకుండా, సంవత్సరానికి సుమారు 90 లక్షల మంది అనేక కారణాలతో మరణిస్తున్నారు. వాటిలో కాలుష్యం కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరాలు దేశంలోని ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. దేశంలో కరోనా కారణంగా 1000 మరణాలు సంభవించాయని, ముందు ముందు ఈ మరణాలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు. భారతదేశంలో సుమారు 19 కోట్ల మంది ప్రజలు కేవలం కూలీ నాలీ చేసుకొని, చిరువ్యాపారాలతో జీవనభృతి పొందుతున్న వారేనని మూర్తి ఈ సందర్భంగా గుర్తుచేశారు. లాక్డౌన్ కారణంగా వీరందరి జీవన భృతి కోల్పోయారని పేర్కోన్నారు. అటు పారిశ్రామిక వేత్తలు కూడా ఆదాయాన్ని 15 నుండి 20 శాతం తగ్గే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అటు ప్రభుత్వానికి కూడా పన్ను, జీఎస్టీ వసూళ్లు తగ్గుతాయని పేర్కొన్నారు. అంతేకాదు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఈ ఏడాది భారత వృద్ధి రేటును 1.9 శాతానికి తగ్గించింది.
First published: April 30, 2020, 2:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading