మే 4 నుంచి మారనున్న లాక్ డౌన్ రూల్స్... కేంద్రం హోంశాఖ

మే 4 నుంచి మారనున్న లాక్ డౌన్ రూల్స్... కేంద్రం హోంశాఖ

ప్రతీకాత్మక చిత్రం

మే 4వ తేదీ నుంచి లాక్ డౌన్ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రకటన జారీ చేసింది.

  • Share this:
    మే 4వ తేదీ నుంచి లాక్ డౌన్ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రకటన జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ మే 3వ తేదీతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మే 4వ తేదీ నుంచి లాక్ డౌన్‌లో కొన్ని మినహాయింపులు ఉంటాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే, ఆ నిబంధనలు ఎలా ఉంటాయి, అవి ఏంటనేది త్వరలో తెలియజేస్తుంది. ‘కేంద్ర హోంశాఖ ఈ రోజు ముమ్మరంగా సమీక్ష నిర్వహించింది. లాక్ డౌన్ పెట్టడం వల్ల ఎంతో ప్రయోజనం కలిగింది. ఆ ప్రయోజనాన్ని పొందడం కోసం లాక్ డౌన్ నిబంధనలు కూడా మార్చి 3 వరకు కచ్చితంగా అమలు చేయాలి. మే 4 నుంచి కొత్త గైడ్ లైన్స్ వస్తాయి. అందులో కొన్ని జిల్లాలకు నిర్మాణాత్మక మినహాయింపులు ఉంటాయి. దీనికి సంబంధించిన డిటెయిల్స్ కేంద్ర హోంశాఖ అప్ డేట్ చేస్తుంది.’ అని కేంద్ర హోంశాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు