లాక్ డౌన్ ఎఫెక్ట్... భారీగా పెరిగిన కండోమ్ సేల్స్...

news18-telugu
Updated: March 26, 2020, 11:02 PM IST
లాక్ డౌన్ ఎఫెక్ట్... భారీగా పెరిగిన కండోమ్ సేల్స్...
కండోమ్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ క్రమంలో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అన్నిటికంటే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే దేశవ్యాప్తంగా కండోమ్ సేల్స్ పెరిగాయి. ఇది అసలే పెళ్లిళ్ల సీజన్. కొత్తగా పెళ్లయిన వారు, కొత్త జంటలు, కొన్నేళ్ల క్రితం పెళ్లయిన జంటలు.. పెద్దవాళ్లు కూడా తమ తమ వారితో గడిపే సమయం దొరుకుతోంది. ఈ క్రమంలో చాలా మంది తమకు దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా ఫార్మా సేల్స్, ఈ కామర్స్ ద్వారా జరిపిన విక్రయాలను గమనిస్తే దేశంలో కండోమ్ సేల్స్ బాగా పెరిగాయి. చాలా మంది కరోనా మాస్క్‌లు, మందులతో పాటు కండోమ్స్, శృంగారానికి సంబంధించిన పిల్స్ కూడా విరివిగా కొంటున్నారు. ‘మా దగ్గరున్న మాస్క్‌లు స్టాక్ మొత్తం అయిపోయింది. జనం అంతా క్లోరోక్విన్, విటమిన్ సీ కోసం అడుగుతున్నారు. అలాగే, కండోమ్స్ విక్రయాలు కూడా బాగా పెరిగాయి.’ అని ఢిల్లీలోని ఓ ఫార్మా కంపెనీ యజమాని చెప్పారు. అలాగే, ఆన్‌లైన్ సేల్స్‌లో కూడా కండోమ్స్ బాగా పెరిగాయని ఓ ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో పనిచేసే వ్యక్తి తెలిపారు.

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రజలు చాలా ఎత్తున ఇళ్లలో ఉంటారని, అందులో జంటలు తమ జీవితంలోకి కొత్త సభ్యులను ఆహ్వానించే పని పెట్టుకుంటే, డిసెంబర్‌లో ఎక్కువ మంది పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్లూ ఆఫీసు పనులు, వారంతాల్లో పార్టీలు, ఫంక్షన్లు అంటూ తిరిగే జంటలకు ఇప్పుడు ఫుల్లుగా ఖాళీ సమయం దొరికింది. దీంతో వారు శృంగార కార్యకలాపాల్లో మునిగిపోతున్నారు. సహజంగా యుద్ధం లాంటి సమయాల్లా ఇలాంటివి జరుగుతుంటాయని, ప్రస్తుతం కరోనా మీద ప్రపంచం కూడా ఓ రకమైన యుద్ధం చేస్తుండడంతో మరోసారి అలాంటి పరిస్థితి వచ్చిందని  నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు  లవ్ క్వారంటైన్‌లో ఉన్నవారికి డిసెంబర్‌లో పిల్లలు పుడితే, వారంతా 2033కి క్వారం‘టీన్స్’  అవుతారనే జోక్స్ కూడా పేలుతున్నాయి.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు