హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Lockodwn: మరో రాష్ట్రంలో లాక్‌డౌన్.. పశ్చిమ బెంగాల్‌లో ఇవి తప్ప అన్నీ బంద్

Lockodwn: మరో రాష్ట్రంలో లాక్‌డౌన్.. పశ్చిమ బెంగాల్‌లో ఇవి తప్ప అన్నీ బంద్

పశ్చిమ బెంగాల్‌లో లాక్‌డౌన్ తరహాలో కఠినమైన ఆంక్షలు విధించారు. నైట్ కర్ఫ్యూతో పాటు పగటి పూట కూడా కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు.

  మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనాను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదని అంతర్జాతీయ నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. తాజాగా బెంగాల్ సీఎంగా మూడోసారి ప్రమణస్వీకారం చేసిన మమతా బెనర్జీ.. కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లాక్‌డౌన్ తరహాలో కఠినమైన ఆంక్షలు విధించారు. నైట్ కర్ఫ్యూతో పాటు పగటి పూట కూడా కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు.

  పశ్చిమ బెంగాల్‌లో ఇవీ కరోనా నిబంధనలు:

  ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఉండాలి.

  షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్‌లు, సినిమా హాళ్లు, బ్యూటీ పార్లర్లు మూసివేత

  బెంగాల్‌లో సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం

  ప్రైవేట్ కార్యాలయాల్లో 50శాతం మంది ఉద్యోగులు పనిచేయాలి. మిగతా వారికి వర్క్ ఫ్రమ్ సదుపాయం కల్పించాలి.

  జ్యువెల్లరీ షాపులకు మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు మాత్రమే అనుమతి.

  బ్యాంకుల పనివేళలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కుదింపు.

  ఈ-కామర్స్ సంస్థలతో పాటు హోటల్ నుంచి ఆహార పదార్థా హోమ్ డెలివరీకి అనుమతి.

  అంతర్రాష్ట్ర బస్సుల్లో అక్కడక్కడా కరోనా టెస్ట్‌లు నిర్వహించాలి.

  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఖచ్చితంగా 72 గంటల లోపు తీసిన ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తీసుకురావాలి.

  రైళ్లల్లో వచ్చే ప్రయాణికులకు కూడా ఇది వర్తిస్తుంది.

  అత్యవసర సేవలకు ఈ లాక్‌డౌన్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.

  తోపుడు బండ్లపై వ్యాపారం చేసే వారితో పాటు జర్నలిస్టులు, ట్రాన్స్‌పోర్టర్స్‌కు కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Lock down, Lockdown, Mamata Banerjee, West Bengal

  ఉత్తమ కథలు