హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Lockdown: మహారాష్ట్రలో ఉన్న తెలుగువారు ఏం చేయవచ్చు? సొంతూళ్లకు ఎలా వెళ్లాలి?

Lockdown: మహారాష్ట్రలో ఉన్న తెలుగువారు ఏం చేయవచ్చు? సొంతూళ్లకు ఎలా వెళ్లాలి?

లోకల్ రైళ్లు, మెట్రో సర్వీసులు, మోనో రైలు ప్రయాణాలపైనా ఆంక్షలు విధించారు. ఇందులో సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్స్, ఆస్పత్రి సిబ్బంది ప్రయాణిస్తారు.

లోకల్ రైళ్లు, మెట్రో సర్వీసులు, మోనో రైలు ప్రయాణాలపైనా ఆంక్షలు విధించారు. ఇందులో సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్స్, ఆస్పత్రి సిబ్బంది ప్రయాణిస్తారు.

లోకల్ రైళ్లు, మెట్రో సర్వీసులు, మోనో రైలు ప్రయాణాలపైనా ఆంక్షలు విధించారు. ఇందులో సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్స్, ఆస్పత్రి సిబ్బంది ప్రయాణిస్తారు.

  అందరూ ఊహించినట్లుగానే మహారాష్ట్రలో కఠినమైన కరోనా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్ 22 రాత్రి 8 నుంచి మే 1 ఉదయం 7 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, పార్క్‌లు, ప్రార్థనాలయాలు మూతపడగా.. తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు విధించారు. పెళ్లిళ్లు, ప్రైవేట్ రవాణా, ప్రజా రవాణా, కార్యాలయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. మరి లాక్‌డౌన్ వేళ మహరాష్ట్రలో ఉన్న తెలుగు వారి పరిస్థితేంటి? ముంబై, పుణె, థానె, నాగ్‌పూర్ సహా పలు నగరాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నారు. లాక్‌డౌన్ విధించడంతో చాలా మంది ఇళ్లకు వెళ్లాలని భావిస్తున్నారు. మరి వారి పరిస్థితేంటి? సొంతూళ్లకు ఎలా వెళ్లాలి?

  మహారాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం సీటింగ్ కెపాసిటీతో ప్రైవేట్ బస్సులు, పబ్లిక్ బస్సులు నడుస్తాయి. బస్సుల్లో ఎవరూ నిలబడకూడదు. నిబంధనలకు అనుగుణంగా అంతర్ జిల్లా బస్సులు, రైళ్లు నడుస్తాయి. రైళ్లు, బస్సులు ఎక్కే చోట థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. కరోనా లక్షణాలు ఉన్న వారిని ఎక్కించుకోకూడదు. వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించాలి.

  ప్రైవేట్ బస్సులు సిటీల్లో రెండు కంటే ఎక్కువ చోట్ల ఆపకూడదు. ప్రయాణికులు దిగే సమయంలో ఖచ్చితంగా 14 రోజుల క్వారంటైన్ స్టాంప్ వేయాలి. ఆపరేట్లదే బాధ్యత. ఖచ్చితంగా థెర్మల్ స్క్రీనింగ్ ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే 10 వేలు జరిమానా విధిస్తారు. పునరావృతమైతే చేస్తే సదరు ట్రావెల్స్ లైసెన్స్ రద్దు చేస్తారు.

  బస్సులు కాకుండా ఇతర ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే వారిపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అంగీకారయోగ్యమైన కారణం చెబితేనే అనుమతి ఉంటుంది. అది కూడా 50శాతం సీటింగ్ కెపాసిటీ మించకూడదు. సిటీ పరిధిలోనే అనుమతి ఉంటుంది. ఇతర జిల్లాలు, ఇతర నగరాలకు వెళ్లేందుకు వీల్లేదు. వైద్య సేవలు, అంత్యక్రియలు అత్యవసర పరిస్థితులకు మినహాయింపు ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే 10వేల జరిమానా విధిస్తారు.

  లోకల్ రైళ్లు, మెట్రో సర్వీసులు, మోనో రైలు ప్రయాణాలపైనా ఆంక్షలు విధించారు. ఇందులో సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్స్, ఆస్పత్రి సిబ్బంది ప్రయాణిస్తారు. వీరికి ప్రత్యేకమైన టికెట్లు లేదా పాస్‌లు కేటాయిస్తారు. వైద్య సేవల కోసం వెళ్లే వారికి కూడా అనుమతి ఉంటుంది.

  ఈ లెక్కన మహారాష్ట్రలో చిక్కుకుపోయిన తెలుగు వాళ్లు, ఇతర రాష్ట్రాల వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. తమకు ఇబ్బంది లేదనుకుంటే అక్కడే ఉండవచ్చు. లేదంటే తమ సొంతూళ్లకు వెళ్లవచ్చు. బస్సులు, రైళ్లు యథావిధిగా నడుస్తాయి. ఐతే లాక్‌డౌన్ నేపథ్యంలో కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలి.

  కాగా, మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం 67,468 కేసులు నమోదయ్యాయి. ఏకంగా 568 మంది మరణించారు. 54,985 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వీటితో కలిపి మహారాష్ట్రలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 40,27,827కి చేరింది. వీరిలో 3268448 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 61,911 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 695747 యాక్టివ్ కోవిడ్ కేసులున్నాయి.

  First published:

  Tags: Coronavirus, Covid-19, Lockdown, Maharashtra, Mumbai

  ఉత్తమ కథలు