Home /News /coronavirus-latest-news /

LOCKDOWN IN GURAJALA OF GUNTUR DISTRICT IN ANDHRA PRADESH FROM TOMORROW AK

ఏపీలోని ఆ ప్రాంతంలో రేపటి నుంచి లాక్‌డౌన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య వేగంగా విస్తరిస్తుండటంతో... గురువారం నుంచి గురజాల రెవిన్యూ డివిజన్ లాక్‌డౌన్ విధించబోతున్నారు.

    కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తుండటంతో కొన్ని చోట్ల మళ్లీ లాక్‌డౌన్ వైపు అడుగులు పడుతున్నాయి. ఏపీలో గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య వేగంగా విస్తరిస్తుండటంతో... గురువారం నుంచి గురజాల రెవిన్యూ డివిజన్ లాక్‌డౌన్ విధించబోతున్నారు. ఈ విషయాన్ని గురజాల ఆర్‌డీవో పార్థసారథి ప్రకటించారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు అనుమతి నిత్యవసరాలు కొనుగోలు చేయాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని పార్థసారథి చెప్పారు. లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని తెలిపారు.

    మరోవైపు గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 468 కేసులు వెలుగు చూశాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3824కు చేరింది. కరోనా నుంచి మొత్తం 1829 మంది కోలుకోగా, 1963 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Coronavirus, Guntur

    తదుపరి వార్తలు