హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

లాక్‌డౌన్ పొడిగిస్తే ఆర్థిక వినాశనమే అంటున్న ఆనంద్ మహీంద్రా..

లాక్‌డౌన్ పొడిగిస్తే ఆర్థిక వినాశనమే అంటున్న ఆనంద్ మహీంద్రా..

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా లాక్‌డౌన్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఇప్పటికే దేశం ఆర్థికంగా క్షీణించిందని, ఇంకా లాక్‌డౌన్ పొడిగిస్తే ఆర్థిక వినాశనం తప్పదని హెచ్చరించారు.

కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. లాక్‌డౌన్ వల్ల ఎప్పుడూ ఎదుర్కొనని ఆర్థిక సవాలును ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా లాక్‌డౌన్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఇప్పటికే దేశం ఆర్థికంగా క్షీణించిందని, ఇంకా లాక్‌డౌన్ పొడిగిస్తే ఆర్థిక వినాశనం తప్పదని హెచ్చరించారు. మళ్లీ లాక్‌డౌన్ పొడిగిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండబోదని, వైద్యపరమైన సంక్షోభం కూడా తలెత్తే అవకాశం ఉందని అన్నారు. లాక్‌డౌన్‌ను పొడిగిస్తే ప్రజల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ పొడిగిస్తే కరోనా కేసుల సంఖ్య తగ్గదని, అందువల్ల ఆ దిశగా ఆలోచనలు విరమించి.. ఆస్పత్రి బెడ్లు, ఆక్సిజన్ లైన్లను పెంచాల్సిన అవసరం ఉందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

First published:

Tags: Anand mahindra, Business, Lockdown

ఉత్తమ కథలు