ఏపీలోని ఆ నగరంలో లాక్‌డౌన్ పొడిగింపు

Ongole Lockdown: కరోనా కట్టడి కోసం ఒంగోలు నగరంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

news18-telugu
Updated: August 12, 2020, 9:28 AM IST
ఏపీలోని ఆ నగరంలో లాక్‌డౌన్ పొడిగింపు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పలు నగరాల్లో ఈ వ్యాప్తి మరికాస్త ఎక్కువగా ఉండటంతో.. కరోనా కట్టడికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఒంగోలు నగరంలో లాక్‌డౌన్‌ ద్వారా వైరస్‌ వ్యాప్తికి చెక్‌ చెక్‌ పెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు కొన్ని రకాల సడలింపులతో పరిమిత ఆంక్షలు విధిస్తూ వచ్చిన అధికారులు.. పూర్తి స్థాయిలో కంటైన్‌మెంట్‌ ఆంక్షలు అమలు చేయడానికి సిద్ధమయ్యారు. పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరుగుతుండటంతో నగరంలో పటిష్టమైన లాక్‌డౌన్‌ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం నుంచి రెండు వారాల పాటు కఠినమైన ఆంక్షలు అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు నిత్యావసర సరుకులకు మాత్రమే అనుమతించారు. మెడికల్‌ షాపులు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. మిగిలిన ఎటువంటి వ్యాపార లావాదేవీలు, కార్యకలాపాలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. తొమ్మిది గంటల తర్వాత ఎవరైనా బయట కనిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులకు ఆదేశాలిచ్చారు. అత్యవసర సేవలకు, విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు విధిగా గుర్తింపు కార్డులను విధిగా వెంట ఉంచుకోవాలని నిబంధనల విధించారు. ఈ నింబంధనలు రెండు వారాలపాటు పక్కాగా అమలు చేయనున్నట్టు తెలిపారు.
Published by: Kishore Akkaladevi
First published: August 12, 2020, 9:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading