Lockdown Exemptions: లాక్‌డౌన్‌పై ఆ రాష్ట్రం కీలక నిర్ణయం.. ఐదు దశల్లో సడలింపులు..

దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ను నియంత్రించేందుకు అనేక రాష్ట్రాలు పాక్షిక లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఆ దిశగా ఆలోచిస్తున్నాయి.

Maharashtra: మహారాష్ట్రలో బుధవారం 15169 కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 285 మంది వైరస్‌కు బలయ్యారు.

 • Share this:
  కరోనా సెకండ్ వేవ్ కారణంగా అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించాయి. కర్ఫ్యూ సహా లాక్‌డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేశాయి. ఈ విషయంలో దేశంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలను చవిచూసిన మహారాష్ట్ర మిగతా రాష్ట్రాల కంటే ముందుగానే లాక్‌డౌన్ విధించింది. అయితే కరోనా కేసులు, మరణాలు తగ్గడంలో లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చేందుకు ఐదు దశలుగా విభజించింది. పాజిటివిటీ రేటు 5 శాతం ఉన్న జిల్లాలు, ఆక్సిజన్ బెడ్లు ఆక్యుపెన్సీ 25 శాతం కంటే తక్కువగా ఉన్న జిల్లాల్లో లాక్‌డౌన్ సడలిస్తారు.

  ఈ జిల్లాల్లో రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, లోకల్ ట్రైన్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, పెళ్లళ్లు సహా అన్నింటికి అనుమతి ఇస్తారు. వీటికి అనుమతి ఇచ్చే జిల్లాల జాబితాలో ఔరంగాబాద్, బందారా, బుల్దానా, చంద్రాపూర్, దులే, గొండియా, గడ్చిరౌలి, జల్గావ్, లాతూర్, నాందేడ్, నాసిక్, పర్బానీ, థానే, జల్నా, నాగ్‌పూర్, వార్దా, వాషిమ్, యావత్మల్ ఉన్నాయి. రెండో దశ అమలు చేసే ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. జిమ్‌లు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు వంటి వాటిని 50 శాతం కెపాసిటీతో అనుమతిస్తారు. పెళ్లిలకు హాజరయ్యే వారిపై ఆంక్షలు కొనసాగుతాయి. ఆ జాబితాలో ముంబై, అహ్మద్‌నగర్, అమరావతి, హింగోలి, నందుర్బర్ ఉన్నాయి.

  మూడో దశ అమలు చేసే జిల్లాల జాబితాలో అకోలా, బీడ్, కోల్హాపూర్, ఉస్మాబాద్, రత్నగిరి, సిందూదుర్గ్, సంగ్లీ, సతారా, పాల్గర్, సోలాపూర్ ఉన్నాయి. నాలుగో దశ అమలు చేసే జిల్లాల జాబితాలో పుణె, రాయిగఢ్ ఉన్నాయి. ఐదో దశ అమలు చేసే జిల్లాల్లో ప్రయాణం చేయడానికి ఈ పాస్ కచ్చితంగా తీసుకోవాలి. మహారాష్ట్రలో బుధవారం 15169 కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 285 మంది వైరస్‌కు బలయ్యారు.
  Published by:Kishore Akkaladevi
  First published: