Home /News /coronavirus-latest-news /

LOCKDOWN EFFECT TV SERIALS STALL DUE TO CORONAVIRUS AND WOMEN VIEWERS GOT FRUSTRATED MK

Lockdown Effect: మందుబాబులే కాదు...మహిళలు కూడా...టీవీ సీరియల్స్ ఆగిపోవడంతో...

టీవీ సీరియల్ చూస్తూ మహిళ సజీవ దహనం

టీవీ సీరియల్ చూస్తూ మహిళ సజీవ దహనం

కార్తీక దీపం లాంటి సీరియల్స్ మంచి ట్విస్టు దగ్గర ఆగిపోయాయి. దీంతో మహిళల్లో ఆ సీరియల్స్ పరిస్థితి ఏంటో తెలియక ఒక షాక్ లోకి కూరుకుపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బుల్లితెర అభిమానులు జీవితంలో ఊహించని పరిణామం...

    దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో మందుబాబులు మద్యం దొరక్క అల్లాడిపోతున్నారు. కొంత మంది అయితే ఏకంగా పిచ్చెక్కి పిచ్చాసుపత్రుల్లో జాయిన్ అయిపోతున్నారు. అంతేకాదు మరికొందరు మందుబాబులు అయితే ఆత్మహత్యలు చేసుకొని విగతజీవులుగా మారిపోతున్నారు. మరికొందరు ఆఫ్టర్ షేవింగ్ లోషన్, అలాగే పెయింట్ థిన్నర్, నెయిల్ పాలిష్ రిమూవర్, సర్జికల్ స్పిరిట్ లాంటి కెమికల్స్ తాగుతూ అనారోగ్యం పాలవుతున్నారు. అయితే మరోవైపు టెలివిజన్ చానెల్స్ లో సీరియల్స్ ఆగిపోవడంతో మహిళలు కూడా అసహనానికి లోనువుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో టీవీ చానెల్స్ లో సీరియల్స్ కొత్త ఎపిసోడ్స్ ఆగిపోయాయి. దీంతో ఆయా సీరియల్స్ అభిమానుల్లో కలవరం ఏర్పడింది. ముఖ్యంగా కార్తీక దీపం లాంటి సీరియల్స్ మంచి ట్విస్టు దగ్గర ఆగిపోయాయి. దీంతో మహిళల్లో ఆ సీరియల్స్ పరిస్థితి ఏంటో తెలియక ఒక షాక్ లోకి కూరుకుపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బుల్లితెర అభిమానులు జీవితంలో ఊహించని పరిణామం ఇదే కావడంతో వారిలో అసహనం పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మానసిక శాస్త్రవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆయా సీరియల్స్ పాత ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేయడం కొద్దిగా ఊరట అయినప్పటికీ, తమ అభిమాన సీరియల్స్ ఎప్పుడు మొదలవుతాయా అనే టెన్షన్ మాత్రం మహిళల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Lockdown, Telugu tv serials

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు