AP Lockdown: ఏపీలో అక్కడ కఠిన లాక్ డౌన్.. ఉదయం 6 నుండి 8 వరకు మాత్రమే అనుమతి

ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయని ఆనంద పడుతుంటే.. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం ఇంకా అదుపులోకి రావడం లేదు. దీంతో అక్కడ లాక్ డౌన్ తప్పక విధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కడో తెలుసా..?

ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయని ఆనంద పడుతుంటే.. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం ఇంకా అదుపులోకి రావడం లేదు. దీంతో అక్కడ లాక్ డౌన్ తప్పక విధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కడో తెలుసా..?

  • Share this:
    అన్నా రఘు న్యూస్ 18 ప్రతినిధి,గుంటూరు

    ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడిప్పుడే కరోనా కాస్త శాంతిస్తోంది అని ఊరట కలుగుతోంది. ఒకప్పుడు ప్రతి రోజూ 20 వేలకుపైగా కేసులు నమోదయ్యేవి.. కానీ ఇప్పుడు పది వేల లోపే కేసులు నమోదు అవుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా లక్ష లోపే ఉందది. దీంతో కరోనా  రెండో దశ తగ్గుమొహం పడుతోందని అంతా ఆశిస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో కొన్ని ప్రాంతాలను మాత్రం కరోనా మహమ్మారి వెంటాడుతోంది. గుంటూరు జిల్లా ఈపూరు మండల కేంద్రమైన ఈపూరు వనికుంట గ్రామాలలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఈ రెండు గ్రామాల్లో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు. అయితే నిత్యావసరాల కోసం మాత్రం.. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు  షాపులు తెరుచుకునేందుకు.. ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. ఆ ప్రాంతం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.

    మరోవైపు ఏపీలో శుక్రవారం నుంచి కొత్త గైడ్ లైన్స్ అమలు కానున్నాయి. మరోపది రోజుల పాటు కర్ఫ్యూను పెంచిన ఏపీ ప్రభుత్వం.. సండలింపులు కొన్ని ప్రకటించింది. అలాగే నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం మొదట ప్రకటించిన కర్ఫ్యూ నేటితో ముగుస్తోంది. నేటి వరకు ప్రస్తుతం ఏపీలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులు తెరుచుకునేందుకు.. నిత్యావసరాల కోసం ప్రజలు బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంది. గత వారంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. పది రోజుల కిందటి వరకు ఏపీలో 20 వేలకు పైగా కేసులు నమోదయ్యేవి.. కానీ ఇప్పుడు పది వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు తగ్గుతున్నాయని నిర్లక్ష్యం దరిచేరనివ్వొద్దని సీఎం జగన్ సూచించారు. గతంలోలానే కఠినంగా కర్ఫ్యూ అమలు చేయాలని.. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

    థర్డ్ వేవ్ అంటూ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరింత అలర్ట్ అవుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా చిన్నారుల తల్లులను కూడా చేర్చింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం పది వేలలోపే కేసులు నమోదు అవుతున్నారు.. తగ్గుదల శాతంలో మార్పు కనిపించడం లేదు. దీంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కఠిన నిబంధనలు అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 20వ తేది వరకు 144 సెక్షన్ ను కఠినంగా అమలు చేయనుంది. మరో వారం రోజుల తరువాత పరిస్థితులను సమీక్షించి.. కర్ఫ్యూను పొడిగించాలా..? లేక అన్ లాక్ డౌన్ ప్రకటించాలా అన్నదానిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
    Published by:Nagesh Paina
    First published: