హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ఒక్క రోజే రూ.68 కోట్లు.. మద్యంతో ఏపీ ప్రభుత్వానికి కాసుల పంట

ఒక్క రోజే రూ.68 కోట్లు.. మద్యంతో ఏపీ ప్రభుత్వానికి కాసుల పంట

క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.

క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.

మద్యం ధరలను భారీగా పెంచి.. పేదల రక్తం తాగుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మద్యపాన నిషేధం కోసమైతే మద్యం అమ్మకాలను నిలిపివేయాలని గానీ.. మద్యం ధరలను భారీగా పెంచడమేంటని ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

  సోమవారం ఏపీ సహా పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. మందుబాబుల భారీ క్యూలతో కళకళలాడాయి. 40 రోజుల పాటు వెలవెలబోయిన వైన్‌షాపులు.. ఒక్కసారిగా కొత్త శోభ సంతరించకున్నాయి. లాక్‌డౌన్ కరువులో ఉన్న మద్యం ప్రియులు.. ఇన్నాళ్లకు షాపులు తెరుచుకోవడంతో పెద్ద మొత్తంలో బాటిళ్లు పట్టుకెళ్లిపోయారు. ఇలాంటి కష్టాలు మళ్లీ రాకూడదనే ముందుచూపుతో.. అప్పుచేసి మరీ నెలకు సరిపడా మద్యం సీసాలను సొంతం చేసుకున్నారు. కర్నాటకలో ఓ వ్యక్తి ఏకంగా రూ.50 వేల మద్యం కొనుగోలు చేశాడు. అంతలా వైన్ షాపులపై దండయాత్ర చేశారు మందుబాబులు. దాంతో ఎన్నడూ లేనంతగా మద్యం అమ్మకాలు జరిగాయి. సోమవారం ఒక్కరోజే ఆయా ప్రభుత్వాలకు పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది.

  ఇక ఏపీ నిన్న ఒక్క రోజే రూ.68.70 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో కంటైన్‌మెంట్ జోన్లలలో మద్యం షాపులను తెరవలేదు. 66.77 శాతం మాత్రమే అమ్మకాలు జరిగాయి. ఐనప్పటికీ పెద్ద మొత్తంలో సరుకు అమ్ముడుపోయింది. ఐతే సోమవారం చాలా చోట్ల కిలోమీటర్ల క్యూలైన్లు కనిపించడం, మందు బాబు సామాజిక దూరం పాటించుకపోడంతో.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం మద్యం ధరలను 25 శాతం పెంచిన ఏపీ సర్కార్... మంగళవారం ఏకంగా మరో 50 శాతం పెంచింది. మద్యం నిషేధంలో భాగంగానే ధరలను భారీగా పెంచుతున్నామని సీఎం జగన్ తెలిపారు.

  ఐతే విపక్షాలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మద్యం ధరలను భారీగా పెంచి.. పేదల రక్తం తాగుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మద్యపాన నిషేధం కోసమైతే మద్యం అమ్మకాలను నిలిపివేయాలని గానీ.. మద్యం ధరలను భారీగా పెంచడమేంటని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. దీని వల్ల సామాన్య, పేల ప్రజలే తీవ్ర ఇబ్బందులు పడతారని ధ్వజమెత్తారు. అటు వైన్ షాపుల టీచర్లకు డ్యూటీ వేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Liquor sales, Liquor shops, Wine shops

  ఉత్తమ కథలు