దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ను మే 4 నుంచి మరో రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన రెండో విడుత లాక్ డౌన్ మే 3తో ముగుస్తుండడంతో కేంద్ర హోంశాఖ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. అయితే, మద్యం ప్రియులకు మాత్రం కేంద్ర హోంశాఖ చిన్న ఊరట కల్పించింది. గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలు, పాన్ షాపులు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ‘మద్యం దుకాణాల వద్ద కేవలం ఐదుగురు మాత్రమే ఉండడానికి అనుమతి ఉంటుంది. అక్కడ సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలి. ప్రతి మనిషికి మధ్య కనీసం రెండు గజాల దూరం ఉండాలి.’ అని కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు ఎవరూ బయట తిరగకూడదు. అత్యవసరం అయితే రావాలి. అన్ని జోన్లలో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, రోగులు, 10 ఏళ్ల లోపు చిన్న పిల్లలు బయటకు రాకూడదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Liquor sales, Lockdown