హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

తమిళనాడు నుంచి ఏపీకి క్యూ... అక్కడ మద్యం అమ్మకాలు నిలిపివేత

తమిళనాడు నుంచి ఏపీకి క్యూ... అక్కడ మద్యం అమ్మకాలు నిలిపివేత

మద్యం షాపుల మందు బారులు తీరిన ప్రజలు

మద్యం షాపుల మందు బారులు తీరిన ప్రజలు

చిత్తూరు జిల్లా పాలసముద్రం తమిళనాడు సరిహద్దులో ఉంటుంది. అక్కడ మద్యం దుకాణం తెరచుకోవడంతో జిల్లా సరిహద్దులోని తమిళనాడు ప్రాంత వాసులు మద్యం కొనుగోలు తరలివచ్చారు.

    లాక్‌డౌన్ 3 మార్గదర్శకాల్లో మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వైన్ షాప్‌లు తెరచుకున్నాయి. దాదాపు 40 రోజుల తర్వాత షాపులు ఓపెన్ కావడంతో మందుబాబులు క్యూకట్టారు. మద్యం ప్రియుల రద్దీతో దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. తమిళనాడు, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు మాత్రం లాక్‌డౌనన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వలేదు. పక్కనే ఉన్న ఏపీలో మద్యం అమ్మకాలు ప్రారంభమవడంతో.. తమిళనాడు, తెలంగాణ సరిహద్దులోని ప్రజలు అక్కడికి క్యూ కడుతున్నారు. చిత్తూరుకు తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున మందుబాబులు తరలివస్తున్నారు.

    చిత్తూరు జిల్లా పాలసముద్రం తమిళనాడు సరిహద్దులో ఉంటుంది. అక్కడ మద్యం దుకాణం తెరచుకోవడంతో జిల్లా సరిహద్దులోని తమిళనాడు ప్రాంత వాసులు మద్యం కొనుగోలు తరలివచ్చారు. వైన్ షాప్ ముందు స్థానికులతో పాటు తమిళనాడు వాసులు కూడా క్యూకట్టారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో.. అక్కడ మద్యం అమ్మకాలను నిలిపివేయాలని తమిళనాడు తహసీల్దార్లు ఏపీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దాంతో చిత్తూరు జిల్లా అధికారులు పాలసముద్రంలో మద్యం అమ్మకాలను నిలిపివేశారు. ఐతే మందుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న స్థానిక మద్యం ప్రియులు చిత్తూరు జిల్లా యంత్రాంగం నిర్ణయాన్ని తప్పుబట్టుతున్నారు. తమిళనాడు నుంచి రాకుండా చర్యలు తీసుకోవాలని గానీ.. ఇక్కడ మద్యం షాపులను మూసివేయడం ఏంటని విమర్శిస్తున్నారు.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Liquor sales, Tamilnadu, Wine shops

    ఉత్తమ కథలు