HOME »NEWS »Corona vilayatandavam »liquor prices in andhra pradesh to rise 25 percentage bn

మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.. 25 శాతం పెరగనున్న మద్యం ధరలు

మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.. 25 శాతం పెరగనున్న మద్యం ధరలు
భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యంతో పాటు, విదేశీ లిక్కర్ ధరలను కూడా ప్రభుత్వం తగ్గించింది.

ఆంధ్రప్రదేశ్‌లో మద్యంపై 25 శాతం ధరలను పెంచనున్నారు. దీంతో పాటు రానున్న రోజుల్లో మద్యం దుకాణాల సంఖ్య తగ్గింపునకు నిర్ణయం తీసుకున్నారు.

  • Share this:
    మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. అసలే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ వల్ల 40 రోజులుగా మద్యం లేక అల్లాడిపోతున్న మందుబాబులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యంపై తాజాగా మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం మరిన్ని అడుగులు ముందుకు వేస్తోంది. మద్యపానం అంటే నిరుత్సాహ పడడంతో పాటు మద్యం దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యంపై 25 శాతం ధరలను పెంచనున్నారు. దీంతో పాటు రానున్న రోజుల్లో మద్యం దుకాణాల సంఖ్య తగ్గింపునకు నిర్ణయం తీసుకున్నారు.

    కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం మద్యం దుకాణాలు రాష్ట్రంలో తెరుచుకోనున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. అయితే పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు చేపట్టనున్నట్టు తెలిపారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా మద్యం విక్రయాలు చేసుకోవాలని సూచించారు. మద్యపానాన్ని నియంత్రించడం.. దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం జగన్ చెప్పారు.

    Published by:Narsimha Badhini
    First published:May 03, 2020, 15:38 IST

    टॉप स्टोरीज