Vaccination Effects: కరోనా టీకాతో రుతుక్ర‌మంలో మార్పులు వస్తాయా..? నిపుణులు ఏం చెబుతున్నారు..

ప్రతీకాత్మక చిత్రం (Image :gletty Image)

Vaccination Effects: కరోనా మహమ్మారికి కళ్లెం వేసే ఏకైక మార్గం కోవిడ్-19 టీకా తీసుకోవడమే. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో చనిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుందని వైద్యులు ఘంటా పథంగా చెబుతున్నారు. అయితే టీకా అందుబాటులోకి వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా కొందరిలో కొన్ని అనుమానాలు అలాగే ఉండి పోయాయి. ముఖ్యంగా మ‌హిళ‌ల రుతుక్ర‌మంలో మార్పులకు, కరోనా టీకాకు సంబంధం ఉంటుందా అనే అనుమానం చాలా మందిలో నెలకొంది.

  • Share this:
కరోనా మహమ్మారికి కళ్లెం వేసే ఏకైక మార్గం కోవిడ్-19 (Covid 19) టీకా తీసుకోవడమే. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో చనిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుందని వైద్యులు ఘంటా పథంగా చెబుతున్నారు. అయితే టీకా అందుబాటులోకి వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా కొందరిలో కొన్ని అనుమానాలు అలాగే ఉండి పోయాయి. ముఖ్యంగా మ‌హిళ‌ల(Womens) రుతుక్ర‌మంలో మార్పులకు, కరోనా టీకాకు సంబంధం ఉంటుందా అనే అనుమానం చాలా మందిలో నెలకొంది. ఈ క్రమంలోనే రుతుక్రమ మార్పులకు, కరోనా టీకాకు మధ్య సంబంధం ఉండొచ్చని బ్రిటీష్ మెడిక‌ల్ జ‌ర్న‌ల్‌లో ప్రచురించిన ఒక ఎడిటోరియల్ అభిప్రాయ‌ప‌డింది. అంతేకాదు, ఈ అంశంపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఈ ఎడిటోరియల్ సూచించింది.

Womens: కరోనా వ్యాక్సిన్​ వల్ల మహిళల్లో పీరియడ్స్‌పై ప్రభావం పడుతుందా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..


కోవిడ్-19 టీకా వేసుకున్న తర్వాత తలెత్తే కామన్ సైడ్ ఎఫెక్ట్స్(Side Effect) లిస్టులో ఊహించని విధంగా పీరియడ్స్/ వజైనల్ బ్లీడింగ్ అవుతుందని ఎక్కడా ప్రస్తావించలేదని విక్టోరియా మేల్ ఎడిటోరియల్‌లో పేర్కొన్నారు. ఈమె యూకేలోని ఇంపీరియల్ కాలేజ్, లండన్ లో రిప్రొడక్టివ్ స్పెష‌లిస్టుగా పని చేస్తున్నారు. ప్రతికూల ఔషధ రియాక్షన్ కోసం ఏర్పాటైన నిఘా/పర్యవేక్షణ పథకం(surveillance scheme) 'యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులటరీ ఏజెన్సీ (MHRA)'కు సెప్టెంబర్ 2 నాటికి 30,000 పైగా రిపోర్ట్స్ అందాయని విక్టోరియా చెప్పుకొచ్చారు. ఆ అన్ని రిపోర్టులలో టీకా తీసుకున్న తర్వాత పీరియడ్స్ రావడం లేదా వజైనల్ బ్లీడింగ్ కావడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ అనుభవించినట్లు మహిళలు పేర్కొన్నారు.

Covid 19: కోవిడ్‌తో తీవ్ర కిడ్నీ సమస్యలు.. అధ్యయనంలో సంచలన నిజాలు.. హెచ్చరిస్తున్న వైద్యులు..


అయితే ఆ తర్వాత నెలలో మళ్లీ యథావిధిగా పీరియడ్స్ వచ్చినట్లు చాలామంది మహిళలు చెప్పారని విక్టోరియా తెలిపారు. మహిళల సంతానోత్పత్తిపై కోవిడ్ 19 టీకా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అయితే భవిష్యత్తులో వైద్య చికిత్స వల్ల మహిళల రుతుస్రావంపై ప్రభావం పడుతుందనే అనుమానానికి తావులేకుండా లోతైన అధ్యయనాలు చేయాలన్నారు.

Lung Cancer: పొగతాగే వారికే కాదు.. పొగతాగని వారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్.. తాజా పరిశోధనలో ఏం తేలిందంటే..


రుతుక్రమంలో మార్పులు, కోవిడ్-19 టీకాల మధ్య సంబంధం ఉందని చెప్పడానికి తమ పర్యవేక్షణ డేటా మద్దతు ఇవ్వదని ఎంహెచ్ఆర్ఏ పేర్కొంది. టీకాలు తీసుకున్న వ్యక్తుల సంఖ్య, రుతుక్రమం మార్పులు నివేదించిన వ్యక్తుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఈ రెండింటి మధ్య లింకు ఉన్నట్లు చెప్పడం లేదని ఎంహెచ్ఆర్ఏ వివరించింది. డేటాను సేకరించిన విధానం కూడా బలమైన నిర్ధారణలకు రావడానికి కష్టతరం చేస్తుందని విక్టోరియా చెప్పారు.

సరైన నిర్ధారణ కోసం టీకా తీసుకున్న, తీసుకొని వారిలో పీరియడ్స్ మార్పుల రేట్లను సరిపోల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఆర్ఎన్ఏ, అడినోవైర‌స్ టీకాలు వేసుకున్న మ‌హిళ‌ల రుతుక్ర‌మంలో మార్పులు గ‌మ‌నించిన‌ట్లు రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయని తెలిపారు. దీన్నిబట్టి టీకాకు రోగనిరోధక ప్రతిస్పందన ఫలితంగా రుతుక్రమంలో మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే, టీకాలోని పదార్థాల వల్ల పీరియడ్స్ లో మార్పులు రాకపోవచ్చని చెప్పడానికి ఇది ఒక కారణం అన్నారు.

Blood Donation: రక్తదానం చేస్తే ‘బరువు’ తగ్గుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..


ఈ ఎడిటోరియల్ సార్స్- కోవ్-2 సోకిన మహిళల్లో నాలుగింట ఒక వంతు మందిలో పీరియడ్స్ విషయంలో మార్పు వచ్చిందని తేల్చిన ఒక అధ్యయనం గురించి ప్రస్తావించింది. వైరస్‌ తీసుకున్న తర్వాత రోగనిరోధకశక్తిలో మార్పు వచ్చి రుతు చక్రం ప్రభావితమవుతుందని ఎడిటోరియల్ పేర్కొంది. పీరియడ్స్‌లో మార్పులు లేదా ఊహించని వజైనల్ రక్తస్రావం గురించి మహిళా రోగులు తెలియజేసేలా వైద్యులు ప్రోత్సహించాలని విక్టోరియా సూచించారు.
Published by:Veera Babu
First published: