COVID-19 కి వ్యతిరేకంగా Lifebuoy ముందుండి చేస్తున్న పోరాటంలో చేరిన తారలు

COVID-19 కి వ్యతిరేకంగా Lifebuoy ముందుండి చేస్తున్న పోరాటంలో చేరిన తారలు

Lifebuoy, బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎమ్సి), ప్రభుత్వ, కార్పొరేట్ సహకార సంస్థతో చేతులు కలిపింది. వీరందరూ కలిసి ఈ మహమ్మారి గురించి అవహగాహన కల్పించడమే కాకుండా, ఈ సమయంలో ముందుండి పనిచేస్తున్న వారికి హైజీన్‌ కిట్లను కూడా అందిస్తున్నారు.

Lifebuoy, బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎమ్సి), ప్రభుత్వ, కార్పొరేట్ సహకార సంస్థతో చేతులు కలిపింది. వీరందరూ కలిసి ఈ మహమ్మారి గురించి అవహగాహన కల్పించడమే కాకుండా, ఈ సమయంలో ముందుండి పనిచేస్తున్న వారికి హైజీన్‌ కిట్లను కూడా అందిస్తున్నారు.

 • Share this:
  నోవెల్ కరోనావైరస్ (COVID-19) మహమ్మారి ఇప్పటి వరకూ ప్రపంచదేశాలన్నీ ఎదుర్కొన్న ఆరోగ్య అత్యవసర పరిస్థితులకంటే మరింత సవాలుగా మారింది. ఇది మనందరి జీవనశైలిలో ఊహించని పెనుమార్పుకు దారితీసింది. మనము ఇంట్లోనే గడపవలసి ఈసుదీర్ఘకాలంలో, వివిధ వనరుల ద్వారా మనం సురక్షితంగా ఎలా ఉండాలనేదాని గురించి నిరంతరం వివిధ రకాల సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈవైరస్‌ను అరికట్టడానికి ప్రభుత్వం అందిస్తున్న జాతీయ స్థాయి చర్యలతోపాటు, అనేక బ్రాండ్లు కూడా సామాజిక దూరం పాటించవలసిన ప్రాముఖ్యత గురించి, COVID-19 కు వ్యతిరేకంగా ఎలా పోరాడాలనే దానిగురించి దేశపౌరులకు సమాచారాన్ని అందించడానికి కృషి చేస్తున్నాయి.

  ప్రతీ ఒక్కరూ ప్రజలకు సహాయపడడానికి తమవంతు ప్రయత్నం చేస్తుండగా, Lifebuoy కూడా చేతులు పరిశుభ్రం చేసుకోవలసిన ప్రాముఖ్యత, చేతులు శుభ్రం చేసుకునే విధానం గురించి దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కలిగించే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. అలాగే వారికి అందుబాటులో ఉన్న ఏదైనా సబ్బుని ఉపయోగించమని పౌరులకు విజ్ఞప్తి చేస్తుంది.

  ఈ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, బ్రాండ్లు అభిమాన బాలీవుడ్ నటి కాజోల్‌‌తోపాటు, ఇండియన్ ర్యాప్ ఆర్టిస్ట్ బాద్‌షా, మాజీ భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ వంటి యూత్ ఐకాన్లతో కలిసి చేతులు కడగవలసిన ప్రత్యేక విధానం, దాని ప్రాముఖ్యత గురించి తెలియచేస్తుంది.

  Lifebuoy ప్రచారకర్త బాలీవుడ్ నటి కాజోల్‌ కూడా తన సోషల్ మీడియా వేదికగా, ఇటువంటి క్లిష్టసమయంలో వారు ఎంచుకున్న సబ్బుతో సంబంధం లేకుండా చేతులు శుభ్రపరచుకోవలసిన ప్రాముఖ్యతపై దృష్టిపెట్టాలని ఆమె వినియోగదారులనుకోరారు.

  చేతులు శుభ్రపరచుకోవలసిన ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పిన బాలీవుడ్‌ నటి, Lifebuoy బ్రాండ్ ప్రచార కర్త కాజోల్ మాట్లాడుతూ " నేను ఎప్పుడూ Lifebuoy తరపున మాట్లాడినప్పటికీ, ఇటువంటి క్లిష్టసమయంలో మీరు Lifebuoy మాత్రమే ఎంచుకోలేరని నేను గ్రహించగలను, అందుకే మీరు Lifebuoyతోపాటు ఏఇ తరసబ్బునైనా ఉపయోగించమని కోరుతున్నాను" అని అన్నారు.

  బాద్షా Lifebuoy ఐకానిక్ జింగిల్ ర్యాప్ వర్షన్‌ను విడుదల చేయడం ద్వారా చేతులు కడుక్కునే సవాలుని ప్రారంభించాడు. తద్వారా చేతులు కడగడంపై అందరిలో ఒక ఆలోచన రేకెత్తిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుత సమయంలో దాని ప్రాముఖ్యత గురించి నొక్కిచెబుతుంది.

  ఈ ప్రత్యేక చొరవ గురించి బాద్షా మాట్లాడుతూ " ఈ సవాలు స్వీకరించే ప్రతీఒక్కరికీ ఈ విధానం ఎంత సులువైనది, ప్రభావవంతమైనదో అర్థం చేసుకోవాలని కోరుతూ, మనమందరం కలసి త్వరలోనే ఈ క్లిష్టసమయాన్ని అధిగమించగలమని ఆశిసున్నాను" అని తెలిపారు.
  @badshahWash karo hands like a boss, Challenge karne waalo ko mera applause ##LifebuoyKarona @Lifebuoy_India♬ Lifebuoy Karona - Lifebuoy


  Paytm, YouWeCan, మాజీ భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫౌండేషన్‌తో ట్రయాంగ్యులర్ పార్ట్‌నర్‌షిప్ చేసుకున్న Lifebuoy ప్రజలకు Paytm ద్వారా విరాళాలు అందించే వీలు కల్పిస్తుంది. ప్రజలు అందించిన ఈ విరాళాలను నిమ్నవర్గాల వారికి అవసరమైన పరిశుభ్రమైన సామాగ్రిని అందించడానికి ఉపయోగిస్తున్నారు.

  భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాట్లాడుతూ,"భారతదేశమంతా కలసికట్టుగా ఉంటూ COVID-19 వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ తమ వంతు కృషి చేయవలసిన సమయం ఇది. వారందరి కోసం ఈమహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి మనందరం కలిసి ప్రతిజ్ఞచేద్దాం. Lifebuoy ఇండియా, Paytmలతో కలిసి ఎక్కువ ప్రమాదం ఉన్న ప్రాంతాల వారికి పరిశుభ్రమైన ఉత్పత్తులను అందించడంలో నావంతు కృషి నేను చేస్తున్నాను, అలాగే మీవంతు కృషి మీరూ చేస్తున్నారని ఆశిస్తున్నాను".  అంతేకాకుండా Lifebuoy, బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎమ్సి), ప్రభుత్వ, కార్పొరేట్ సహకార సంస్థతో చేతులు కలిపింది. వీరందరూ కలిసి ఈ మహమ్మారి గురించి అవహగాహన కల్పించడమే కాకుండా, ఈ సమయంలో ముందుండి పనిచేస్తున్న వారికి హైజీన్‌ కిట్లను కూడా అందిస్తున్నారు.

  భారతీయులుగా ఒక క్లిష్టమైన సమయాన్నిఎదుర్కొంటున్నఈ పరిస్థితిలో, సమిష్టిగా ఈ మహమ్మారిపై పోరాడి గెలవడానికి ప్రజలలో అవగాహన కలిగించేందుకు Lifebuoy వంటి బ్రాండ్లు చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయం. ఈ క్లిష్టమైన సమయాన్ని అంతం చేయడానికి మన వంతు కృషి చేయవలసిన బాధ్యత మనందరిపై ఉంది.

  ఇది ఒక భాగస్వామ్య ప్రకటన.
  Published by:Santhosh Kumar S
  First published:

  అగ్ర కథనాలు