Library: ముంబై మున్సిపల్​ కార్పొరేషన్​ వినూత్న ప్రయోగం.. ఏంటో తెలిస్తే షాక్ తింటారు..

Library: ముంబై మున్సిపల్​ కార్పొరేషన్​ వినూత్న ప్రయోగం.. ఏంటో తెలిస్తే షాక్ తింటారు..

ప్రతీకాత్మకచిత్రం

నవీ ముంబై మున్సిపల్​ కార్పొరేషన్​ (ఎన్‌ఎంఎంసి). నవీ ముంబై కోవిడ్​ కేర్​ సెంటర్​లో అధికారులు ఒక తాత్కాలిక లైబ్రరీని ఏర్పాటు చేశారు. కరోనా రోగులు 14 రోజుల పాటు ఖాళీగా కూర్చోవడం వల్ల వారిలో ప్రతికూల ఆలోచనలు, భయందోళనలు కలిగే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్​ కేర్​ సెంటర్లలో లైబ్రరీని ఏర్పాటు చేశామని చెబుతున్నారు

  • Share this:
కరోనా రోగులు హోమ్​ ఐసోలేషన్​లో ఉండేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. స్వల్ప లక్షణాలున్న కరోనా రోగులు ఈ సెంటర్లలో 14 రోజుల పాటు ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో చాలా మంది రోగులు బోర్​గా ఫీలవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వినూత్న కార్యక్రమం చేపట్టింది నవీ ముంబై మున్సిపల్​ కార్పొరేషన్​ (ఎన్‌ఎంఎంసి). నవీ ముంబై కోవిడ్​ కేర్​ సెంటర్​లో అధికారులు ఒక తాత్కాలిక లైబ్రరీని ఏర్పాటు చేశారు. కరోనా రోగులు 14 రోజుల పాటు ఖాళీగా కూర్చోవడం వల్ల వారిలో ప్రతికూల ఆలోచనలు, భయందోళనలు కలిగే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్​ కేర్​ సెంటర్లలో లైబ్రరీని ఏర్పాటు చేశామని చెబుతున్నారు ఎన్‌ఎంఎంసి చీఫ్ అభిజీత్ బంగర్. ఇప్పుడు బాధితులు తమకు నచ్చిన పుస్తకాలు చదువుకుంటూ ఆత్మస్థైర్యం పెంపొందించుకుంటున్నారని ఆయన తెలిపారు.

లైబ్రరీ ఏర్పాటు చేసిన తరువాత ఒంటరితనం నుంచి క్రమంగా దూరమవుతున్నారు. ప్రతికూల ఆలోచనల నుంచి రోగుల దృష్టిని మళ్లించడం, వారిని చదవడంలో నిమగ్నం చేయడానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ లైబ్రరీ మంచి ఫలితాలనిస్తోంది. దీంతో వీటిని ముంబైలోని అన్ని కోవిడ్ సెంటర్లకు విస్తరించాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. త్వరలోనే అన్ని కోవిడ్ కేర్ సెంటర్లలో తాత్కాలిక లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నామని బంగర్ పేర్కొన్నారు.

ఈ తాత్కాలిక లైబ్రరీని సిడ్కో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఉన్న కోవిడ్ కేర్​ సెంటర్‌లో ఏర్పాటు చేశారు. దీనికి లెట్స్ రీడ్ ఇండియా ఫౌండేషన్ సహకారం అందించింది. ఈ ఫౌండేషన్​ చైర్మన్​ ప్రఫుల్లా వాంఖడే మాట్లాడుతూ.. “ప్రాణాంతక వైరస్‌తో పోరాడుతున్నప్పుడు ఒంటరిగా ఉన్న వ్యక్తులు జీవితంపై ఆశను కోల్పోయే ప్రమాదం ఉంది. వారు కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు ఈ ప్రభావం మరింతగా ఉంటుంది. అలాంటి సమయంలో పుస్తకాలు వారికి ఓదార్పునిస్తాయి. వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయి. ఇవి రోగుల్లోని ప్రతికూల ఆలోచనలను దూరంచేస్తాయి” అని చెప్పారు.

త్వరలోనే మరిన్ని కోవిడ్​ సెంటర్లలో..
కోవిడ్ రోగుల కోసం మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో అద్భుతమైన పుస్తకాలను సేకరించారు. వీటిని లైబ్రరీలో అందుబాటులోకి తెచ్చారు. ఈ సంరక్షణ కేంద్రాన్ని పర్యవేక్షించే బాధ్యతను ఎన్‌ఎంఎంసి బృందంలో భాగమైన సచిన్ జాదవ్ తీసుకున్నారు. కోవిడ్ కేర్​ సెంటర్​లో చికిత్స పొందుతున్న కొంతమంది రోగులతో మాట్లాడినప్పుడు తమకు ఈ ఆలోచన వచ్చిందని ఆయన అన్నారు. వారిలో కరోనా వైరస్​ తగ్గించి రీడింగ్​ వైరస్​ నింపాలనేదే మా ప్రయత్నమని ఆయన స్పష్టం చేశారు. ఇతర కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా ఇలాంటి తాత్కాలిక లైబ్రరీని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ముంబై మున్సిపల్​ కార్పొరేషన్​ పేర్కొంది.
Published by:Krishna Adithya
First published: