అలా చేస్తే కరోనా పోతుంది.. పాతబస్తీ బోనాల వేడుకల్లో భవిష్యవాణి

ఎవరు చేసుకున్న తప్పులకు వారు శిక్ష అనుభవిస్తున్నారని.. మీరు చేసిన తప్పుల వల్లే కరోనా లాంటి రోగాలు వస్తున్నాయని అన్నారు. కరోనా రోగం పోవాలంటే గ్రామ పొలిమేరల్లో ఉన్న శక్తులను శాంతింపజేయాలని ప్రజలకు సూచించారు.

ఎవరు చేసుకున్న తప్పులకు వారు శిక్ష అనుభవిస్తున్నారని.. మీరు చేసిన తప్పుల వల్లే కరోనా లాంటి రోగాలు వస్తున్నాయని అన్నారు. కరోనా రోగం పోవాలంటే గ్రామ పొలిమేరల్లో ఉన్న శక్తులను శాంతింపజేయాలని ప్రజలకు సూచించారు.

  • Share this:
    హైదరాబాద్‌లో ఆషాడ బోనాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. కరోనా వల్ల గత వైభవం లేదు. ఎవరికి వారు ఇంట్లోనే బోనాలు చేసి.. అమ్మవారికి సమర్పిస్తున్నారు. గత వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలు ముగియగా.. ఈ ఆదివారం పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు వేడుకలు జరిగాయి. ఐతే తెలంగాణలో బోనాల వేడుకతో పాటు ఆ మరుసటి రోజు జోగిని చెప్పే భవిష్య వాణి కూడా అంతే ఫేమస్..! వారు చెప్పే భవిష్యవాణి నిజమని భక్తులు విశ్వసిస్తారు. గత వారం సికింద్రాబాద్‌లో స్వర్ణలత జోస్యం చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని గడ్డుపరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రజలను ఆమె హెచ్చరించారు.

    సోమవారం పాతబస్తీ బోనాల వేడుకల్లోనూ జోగిని భవిష్య వాణి వినిపించారు. ఎవరు చేసుకున్న తప్పులకు వారు శిక్ష అనుభవిస్తున్నారని.. మీరు చేసిన తప్పుల వల్లే కరోనా లాంటి రోగాలు వస్తున్నాయని అన్నారు. కరోనా రోగం పోవాలంటే గ్రామ పొలిమేరల్లో ఉన్న శక్తులను శాంతింపజేయాలని ప్రజలకు సూచించారు.

    నా చుట్టూ ఎన్ని శక్తులు ఉన్నాయి. వాటికి కూడా ఆరగింపుకావాలని కోరుతున్నాయి. వచ్చిన రోగాన్ని తొలగించాలంటే మీ మధ్యే ఉంది. మీరు తెచ్చుకున్నది అనుభవించక తప్పదు. నాకు శాంతం లేదు. సంతోషం లేదు. ఆనందం లేదు. మీరు చేసుకున్న పాపం వల్లే లేనిపోని రోగాలు ఒకదాని వెనక ఒకటి వస్తున్నాయి. మీ తప్పులకు మీరే బాధ్యులు. మీ పొలిమేర చుట్టూ ఉన్న శక్తులకు మీరు శాంతి చేయండి. ఎలాంటి రోగాలు రాకుండా చూస్తా. వాటికి కుంభమేళా చేయండి. పచ్చి మాసంతో ఆరగింపు ఇవ్వండి. అవి శాంతించి రోగాలను పొలిమేర దాటనీయవు.
    జోగిని


    తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 45వేలు దాటింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 45076 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 32,438 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా డిశ్చార్జ్ రేటు అత్యధికంగా ఉంది. ఇదొక్కటే ఊరట అని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 2,65,219 కరోనా శాంపిల్స్ టెస్టు చేశారు. గడిచిన 24 గంటల్లో 12,519 శాంపిల్స్ టెస్ట్ చేశారు. ఇక బెడ్స్ విషయానికి వస్తే రాష్ట్రంలో 17,081 బెడ్స్ అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. ఇందులో 1900 బెడ్స్‌ ఆక్యుపై అయింది. 15,181 బెడ్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయి
    Published by:Shiva Kumar Addula
    First published: