HOME »NEWS »Corona vilayatandavam »labour minister santosh gangwars wife 6 family members test covid positive ba

కేంద్ర మంత్రి భార్య సహా కుటుంబంలో ఏడుగురికి కరోనా పాజిటివ్

కేంద్ర మంత్రి భార్య సహా కుటుంబంలో ఏడుగురికి కరోనా పాజిటివ్
సంతోష్ గాంగ్వార్, కేంద్ర మంత్రి (Image; PIB/Twitter)

71 సంవత్సరాల సంతోష్ గాంగ్వార్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆయన రిపోర్టుల్లో నెగిటివ్ అని వచ్చింది.

 • Share this:
  కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ భార్య సహా ఆయన కుటుంబంలో మొత్తం ఏడుగురు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని సంతోష్ గాంగ్వార్ స్వయంగా వెల్లడించారు. 71 సంవత్సరాల సంతోష్ గాంగ్వార్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆయన రిపోర్టుల్లో నెగిటివ్ అని వచ్చింది. సంతోష్ గాంగ్వార్ ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఇటీవల కేంద్ర మంత్రి కుటుంబసభ్యులు ఢిల్లీ వెళ్లారని, అక్కడ కరోనా వైరస్ వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు. కేంద్ర మంత్రి భార్య, మిగిలిన కుటుంబసభ్యులు అందరూ ఫరీదాబాద్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో చేరారు. వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఆ ఇంట్లో వంటమనిషికి కూడా అనారోగ్యం రావడంతో ముందస్తు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేర్పించారు. మరోవైపు కార్మిక శాఖలో పలువురు ఉద్యోగులు కూడా కరోనా బారిన పడ్డారని కేంద్ర మంత్రి తెలిపారు.

  ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని స్మృతి ఇరానీ తన ట్విటర్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. ‘ఏదైనా చెప్పడానికి నేను మాటలు వెతుకున్న సందర్భాలు చాలా అరుదు. అందుకే సింపుల్‌గా చెబుతున్నా. నాకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల నన్న కలిసిన వారు వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోండి.’ అని స్మృతి ఇరానీ కోరారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తాజాగా బీహీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీహార్‌లో జేడీయూ - బీజేపీ కూటమిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని కొందరు మంత్రులు కూడా గతంలో కరోనా వైరస్ బారిన పడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. వారంతా కరోనా నుంచి కోలుకున్నారు.  ఇండియాలో నిన్న 48,268 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 81,37,119కి చేరింది. అలాగే నిన్న కరోనాతో 551 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,21,641కి చేరింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 2.6 శాతంగా ఉంది. ఇండియాలో నిన్న 59,454 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 74,32,829గా ఉంది. దేశంలో రికవరీ రేటు 91.3 శాతానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,82,649గా ఉన్నాయి. నిన్న ఇండియాలో 10,67,976 టెస్టులు చేశారు. మొన్నటి కంటే అవి 96,672 తక్కువగా ఉన్నాయి. మొత్తం టెస్టుల సంఖ్య 10కోట్ల 87లక్షల 96వేల 64కి చేరింది. ఇప్పుడు ఇండియాలో నిన్న ఛండీగఢ్ (19), ఢిల్లీ (1411), హర్యానా (460), హిమాచల్ ప్రదేశ్ (123), మిజోరం (2), పుదుచ్చేరి (19), ఉత్తరాఖండ్ (89), రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక్కడ కూడా అవి కంట్రోల్ అయితే... ఇక కరోనా నుంచి దేశం బాగా కోలుకున్నట్లే అనుకోవచ్చు. ముఖ్యంగా ఢిల్లీలో మళ్లీ కేసులు ఎక్కువగా నమోదవుతుండటం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఐతే... ఢిల్లీలో 28 రోజులుగా... కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయి.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:October 31, 2020, 16:55 IST