ఏపీలో స్కూల్ టీచర్ సూపర్ ఐడియా, విద్యార్థులకు కరోనా సోకకుండా

కర్నూలులో ఓ పాఠశాల టీచర్ కొత్త ఐడియాతో ముందుకొచ్చారు. విద్యార్థులను క్లాస్ రూమ్‌లో కాకుండా, ఆరుబయట కూర్చోబెట్టారు.

news18-telugu
Updated: November 6, 2020, 2:52 PM IST
ఏపీలో స్కూల్ టీచర్ సూపర్ ఐడియా, విద్యార్థులకు కరోనా సోకకుండా
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2న ప్రభుత్వ స్కూళ్లు తెరిచారు. 9, 10 తరగతుల విద్యార్థులకు స్కూళ్లు తెరవగా విద్యార్థుల హాజరు శాతం కూడా బాగానే ఉంది. కానీ, విద్యార్థులు, టీచర్లకు కరోనా సోకడం మాత్రం సంచలనంగా మారింది. స్కూళ్లలో నిర్వహిస్తున్న కరోనా టెస్టుల్లో వందలాది మంది టీచర్లు, విద్యార్థులకు కరోనా పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి. ఈ క్రమంలో అటు టీచర్లు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం విద్యాశాఖలో 70,790 మంది టీచర్లకు కరోనా టెస్టులు నిర్వహించారు. వారిలో 829 మంది టీచర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక 95,763 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, 575 మందికి కరోనా సోకినట్టు తేలింది. చిత్తూరు జిల్లా గోవిందప్ప నాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన లెక్కల టీచర్ దినేష్ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత పెరిగింది.

ఇలాంటి పరిస్థితుల్లో, విద్యార్థులకు కరోనా సోకకుండా ఓ టీచర్ సూపర్ ఐడియా వేశారు. కర్నూలులో ఓ పాఠశాల టీచర్ కొత్త ఐడియాతో ముందుకొచ్చారు. విద్యార్థులను క్లాస్ రూమ్‌లో కాకుండా, ఆరుబయట కూర్చోబెట్టారు. అలాగే విద్యార్థులు సామాజిక దూరం పాటిస్తూ దూరం దూరంగా కూర్చోబెట్టారు. అలాగే, ఒక్కో లైన్‌కు మధ్యలో అడ్డంగా చీరలు కట్టారు. ఈ వినూత్న ఐడియా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.

కర్నూలులోని ఓ స్కూల్లో టీచర్ ఐడియా


ఏపీలో నవంబర్ 5న ప్రకటించిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 85364 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 835953కు చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో మరో 13 మంది చనిపోయారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, విశాఖలో ఇధ్దరు, అనంతపురం,, తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 6757కు చేరింది. కొత్తగా 2292 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఏపీలో ఇప్పటివరకు కరోనా జయించిన వారి సంఖ్య 807318కు చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 21878గా ఉంది. 24 గంటల్లో ఏపీలో 85364 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 8427629కు చేరుకుంది. రాష్ట్రంలో కొత్తగా పశ్చిమ గోదావరి జిల్లాలో 428, తూర్పు గోదావరి 407, కృష్ణా 398, చిత్తూరు 286, అనంతపురం 218, నెల్లూరు 130, కడప 125, ప్రకాశం 124, విశాఖ 120, శ్రీకాకుళం 91, విజయనగరం 83, కర్నూలు జిల్లాలో 38 కేసులు నమోదయ్యాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 6, 2020, 2:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading