KTR Birthday | అన్ని జిల్లాలకు కరోనా టెస్టింగ్ ఆంబులెన్స్‌లు.. ముందుకొచ్చిన నేతలు

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు తన పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

news18-telugu
Updated: July 24, 2020, 10:24 PM IST
KTR Birthday | అన్ని జిల్లాలకు కరోనా టెస్టింగ్ ఆంబులెన్స్‌లు.. ముందుకొచ్చిన నేతలు
కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి ఈటల రాజేందర్
  • Share this:
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు తన పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వంతుగా కరోనా టెస్టులు నిర్వహించేందుకు ఆరు ఆంబులెన్స్‌లను ప్రభుత్వ ఆస్పత్రులకు అందిస్తానని ప్రకటించారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేటీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పడానికి వెళ్లినప్పుడు తాను వ్యక్తిగతంగా రాష్ట్రానికి ఆంబులెన్స్‌లు కొని ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆంబులెన్స్ డబ్బులు తాను ఇస్తానన్నారు. దాన్ని పార్టీ తరఫున ఇస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వాటిని వినియోగించుకోవాలని, వీలైనంత త్వరగా వాటిని అందజేస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ నిర్ణయాన్ని అభినందించిన మంత్రి ఈటల తాను కూడా తన నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా పార్టీ తరఫున 5 ఆంబులెన్స్‌లను సమకూరుస్తానని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో మినీ ఆస్పత్రులుగా ఇవి ఉపయోగపడతాయన్నారు.

కేటీఆర్ ఆంబులెన్స్‌లు ఇస్తానని ప్రకటించడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు కూడా తాము సైతం అంటూ ముందుకొచ్చారు. మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట, యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో ఆరు ఆంబులెన్స్‌లు ఇస్తానన్నారు. మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ, నేతల తరఫున 11 ఆంబులెన్స్‌లను సమకూరుస్తామన్నారు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో మరికొందరితో కలసి వరంగల్ జిల్లా తరఫున 6 ఆంబులెన్స్‌లు అందజేస్తామన్నారు. మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా నాలుగు ఆంబులెన్స్‌లను ఇస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ రంజిత్ రెడ్డి తనవంతుగా ఏడు ఆంబులెన్స్‌లు ఇస్తానన్నారు. నామా నాగేశ్వరరావు 6, మంత్రి మల్లారెడ్డి 6, సబితా ఇంద్రారెడ్డి 2 ఆంబులెన్స్‌లు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. మొత్తం 32 జిల్లాల్లో వంద ఆంబులెన్స్‌లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధమైంది. 15 రోజుల నుంచి నెల రోజుల్లోపే వీటిని ఆయా జిల్లాల్లో ఆస్పత్రులకు ఇచ్చేలా చూడాలని నిర్ణయించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 24, 2020, 10:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading