చెబితే వినలేదు.. అందుకే పద్మారావుకు కరోనా.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

టి. పద్మారావు (Image:Facebook)

తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా వైరస్ సోకిన అంశంపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 • Share this:
  తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా వైరస్ సోకిన అంశంపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ఓ సంఘటనను కేటీఆర్ ప్రస్తావించారు. కరీంనగర్​ జిల్లాలో పర్యటించిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఓ ఆసక్తికర విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. ఒక కార్యక్రమంలో పద్మారావుకు తాను మాస్క్‌ ఇచ్చానని చెప్పారు. కానీ పద్మారావు మాస్క్‌ ధరించకుండా జేబులో పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఏం కాదు. హైదరాబాద్ వాళ్లం గట్టిగా ఉంటామని చెప్పుకొచ్చారన్నారు. చివరికి పద్మారావుకే కరోనా సోకిందని కేటీఆర్ ప్రస్తావించారు. జాగ్రత్త పాటించడం మన కోసమే కాదు.. మన కుటుంబ సభ్యులకు రక్షణ కోసం అన్నారు.

  కరోనా నుంచి రక్షణ పొందే విషయంలో ఎవరికి వారు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కరోనా నుంచి రక్షణ కోసం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు డాక్టర్లలా సలహాలిచ్చేస్తున్నారని జోక్స్ వేశారు.  ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక కరోనా వైరస్‌కు ఇంటిచికిత్స అంటూ పద్మారావు గౌడ్ తన అనుచరుడు ఒకరితో మాట్లాడుతున్నట్టుగా ఓ ఆడియో క్లిప్ ఇటీవల వెలుగులోకి వచ్చింది. అందులో కరోనా చికిత్స కోసం సొంటి, లవంగాలు, యాలాకులు ఇంకా మరిన్ని పదార్థాలు కలిపి దంచి పొడిచేసుకోని దానిని వేడి నీటితో కలిపి రోజు తీసుకోవాలని సూచించినట్లు ఉంది. ఇది వైరల్‌గా మారడంతో పద్మారావు గౌడ్ స్పందించారు. ఆ ఆడియో క్లిప్ తనది కాదని స్పష్టం చేశారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: