కృష్ణా జిల్లా వాసులకు హెచ్చరిక, ఈ ఆరు గ్రామాలకు వెళ్లొద్దు

కృష్ణా జిల్లాలో నూతనంగా 6 కంటైన్మెంట్ జోన్లు ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.

news18-telugu
Updated: September 25, 2020, 4:26 PM IST
కృష్ణా జిల్లా వాసులకు హెచ్చరిక, ఈ ఆరు గ్రామాలకు వెళ్లొద్దు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Krishna Corona Cases: కృష్ణా జిల్లాలో నూతనంగా 6 కంటైన్మెంట్ జోన్లు ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతాల్లో నూతనంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున కరోనా వ్యాప్తి నిరోధించడానికి కంటైన్మెంట్ జోన్లు ప్రకటించినట్టు ఆయన తెలిపారు. కంటైన్మెంట్ జోన్లు అంటే బయటి వారు అందులోకి వెళ్లకూడదు. అలాగే, కంటైన్మెంట్ జోన్లలో ఉండే వారు బయటకు రాకూడదు. వారికి సంబంధించిన నిత్యావసర సరుకులు అన్నీ స్థానికంగానే అందుబాటులో ఉండేలా ప్రభుత్వ యంత్రాంగం చూస్తుంది.

కృష్ణా జిల్లాలో కొత్త కంటైన్మెంట్ జోన్లు

1. అవనిగడ్డ మండలంలోని వాకనూరు గ్రామం
2. చల్లపల్లి మండలంలో లక్ష్మీపురం గ్రామం
3. చందర్లపాడు మండలంలో తోటరావులపాడు గ్రామం
4. గూడూరు మండలంలో షబ్ధుల్లపాలెం గ్రామం
5. జగ్గయ్యపేట మండలంలో తొర్రగుంటపాలెం గ్రామం6. విస్సన్నపేట మండలంలో కోర్లమంద గ్రామం

Sero Survey, Sero Survey in Andhra Pradesh, AP Sero Survey, ఏపీ సీరో సర్వే, ఏపీలో సీరో సర్వే,
ఏపీలో కరోనా కేసులు


ఈ ప్రాంతాలలో కంటైన్మెంట్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని, ప్రజలు ఎవరు బయటకు రాకూడదని జిల్లా కలెక్టర్ తెలిపారు. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 504 కంటైన్మెంట్ జోన్లలో 2,786 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందువలన కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ విజ్ఞప్తి చేశారు. అలాగే, గత 28 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాని ఈ క్రింది గ్రామాల్లో కంటైన్మెంట్ జోన్ల నిబంధనలను తొలగించినట్లుగా కలెక్టర్ తెలియజేశారు.

Corona virus cases, ap corona cases, ap covid 19 news, covid 19 andhra Pradesh, corona deaths in andhra Pradesh, ap corona news, ఏపీ కరోనా కేసులు, ఏపీ కోవిడ్ 19, ఏపీలో కరోనా మరణాలు, ఏపీ కరోనా కేసులు
ప్రతీకాత్మక చిత్రం


1. ఘంటసాల మండలంలో కొడాలి గ్రామం
2. గుడివాడ మండలంలో దొండపాడు గ్రామం
3. గుడ్లవల్లేరు మండలంలో పురిటిపాడు గ్రామం
4. మచిలీపట్నం మండలంలో మంగినపూడి గ్రామం
5. మచిలీపట్టణం మున్సిపలిటీలో టీచర్స్ కాలని
6. మైలవరం మండలంలో దాసుళ్ళపాలెం గ్రామం
7. నందిగామ మండలంలో ఐతవరం గ్రామం
8. రెడ్డిగూడెం మండలంలో శ్రీరాంపురం గ్రామం
9. రెడ్డిగూడెం మండలంలో ముచ్చినపల్లి గ్రామం

Corona virus, ap corona cases, ap covid 19, ap corona cases, new corona cases in andhra Pradesh, ap news, కరోనా కేసులు, ఏపీ కరోనా కేసులు, ఏపీ కేసులు, కరోనా కేసులు, ఏపీ కోవిడ్ 19 కేసులు, ఆంధ్రప్రదేశ్
ప్రతీకాత్మక చిత్రం


ఏపీలో ఇప్పటివరకు 654385 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈనెల 24న ప్రకటించిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం కరోనా కారణంగా రాష్ట్రంలో కొత్తగా 52 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో 8, అనంతపురం 6, గుంటూరు 6, కృష్ణ 5, ప్రకాశం 5, విశాఖ 5, తూర్పు గోదావరి 4, కడప 3, కర్నూలు 3, పశ్చిమ గోదావరి 3, విజయనగరం 2, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. వీరితో కలిపి రాష్ట్రంలో వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5558కు చేరింది. ఇక రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8807 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఏపీలో కరోనాను జయించిన వారి సంఖ్య 579474కు చేరింది. ప్రస్తుతం ఏపీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 69353గా ఉంది. 24 గంటల్లో కొత్తగా 76000 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు ఏపీలో నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 5378367కు చేరుకుంది. మరోవైపు కరోనా టెస్టుల విషయంలో ఏపీ కొత్త రికార్డ్ సృష్టించింది. ప్రతి 10 లక్షల మందిలో లక్ష మందికి కరోనా టెస్టులు నిర్వహించింది. రాష్ట్రంలో కొత్తగా తూర్పు గోదావరి జిల్లాలో 1095 కేసులు, పశ్చిమ గోదావరిలో 992, ప్రకాశం 927, చిత్తూరు 902, గుంటూరు 551, కడప 545, అనంతపురం 497, శ్రీకాకుళం 461, విశాఖ 425, నెల్లూరు 405, విజయనగరం 384, కృష్ణా 346, కర్నూలు జిల్లాలో 325 కొత్త కేసులు నమోదయ్యాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 25, 2020, 4:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading