దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పునరావాస కార్యక్రమాల కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పీఎం కేర్స్ నిధికి భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ.కోటితో పాటుగా ఒక నెల వేతనాన్ని ఇస్తున్నట్టు ఆయన బుధవారం ప్రకటించారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.కోటి కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేగాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తాను ఎంపీగా గెలిచిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి రూ.50 లక్షలను కరోనా పునరావాస కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించిన లేఖలను బుధవారం తెలంగాణ సీఎంకు, హైదరాబాద్ కలెక్టర్కు పంపారు. దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్న తరుణంలో ప్రజలు స్వచ్ఛందంగా తమకు తోచినంత పీఎం కేర్స్ నిధికి విరాళాలు ఇవ్వాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Secunderabad, Telangana, Union Home Ministry