హైదరాబాద్‌లో కరోనా విజృంభణపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...

కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)

దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన భాగ్యనగరం డేంజర్ జోన్‌లో ఉందని, ఎప్పుడు పేలుతుందో తెలియదని ఆందోళన చెందారు.

  • Share this:
    తెలంగాణలో కరోనాపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తోందని అన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన భాగ్యనగరం డేంజర్ జోన్‌లో ఉందని, ఎప్పుడు పేలుతుందో తెలియదని ఆందోళన చెందారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అధికార టీఆర్ఎస్ పార్టీ మీద కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని సూచించారు. కరోనా కట్టడి కోసం తెలంగాణకు కేంద్రం పెద్దఎత్తున సాయం చేసిందని, తెలంగాణలో బెడ్లు లేక కరోనా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని తెలిపారు. తెలంగాణలో పాత సచివాలయాన్ని కూల్చేందుకు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం దాన్ని కోవిడ్ 19 ఆస్పత్రిగా మార్చాలని కిషన్ రెడ్డి సూచించారు. ఇంజినీరింగ్ కాలేజీలను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగించాలని సూచించారు.

    తెలంగాణలో వరుసగా రెండో రోజు కూడా 1800 కరోనా కేసులు దాటాయి. ఈ రోజు తెలంగాణలో 1850 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే మొత్తం 1572 కోవిడ్ 19 కేసులు నిర్ధారణ అయ్యాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 6427 కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 4577 నెగిటివ్ వచ్చాయి. 1850 పాజిటివ్ వచ్చాయి. 1342 మంది డిశ్చార్జ్ అయ్యారు. 5 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో జీహెచ్ఎంసీ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లా (92) కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ (53), వరంగల్ అర్బన్ (31), కరీంనగర్ (18), నిజామాబాద్ (17), నల్లగొండ (10), సంగారెడ్డి (8), ఖమ్మం (7), వరంగల్ రూరల్ (6), సిద్దిపేట (5), మహబూబ్ నగర్ (5), జగిత్యాల (5), భూపాలపల్లి (4), జనగాం (3), వికారాబాద్ (3), భద్రాద్రి కొత్తగూడెం (3), రాజన్న సిరిసిల్ల (3), గద్వాల (2), నిర్మల్ (1), భువనగిరి (1), మెదక్ జిల్లాలో (1) కరోనా కేసు నమోదైంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: