Home /News /coronavirus-latest-news /

KIM SISTER KIM YO JONG STRONG WARNING TO AMERICA DISMISSES CHANCE FOR TALKS NGS

Kim Yo Jong: నియంతను మించిన సోదరి.. అమెరికాకు నేరుగా వార్నింగ్ ఇచ్చిన కిమ్ యో జో

నియంత కిమ్ ను మించిపోతున్న సోదరి

నియంత కిమ్ ను మించిపోతున్న సోదరి

కిమ్ ఉన్ అనుకుంటే మించిపోయే నియంతలా ఉన్నారు ఆయన సోదరి.. తాజాగా అమెరికాకే ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఇకపై మాట్లాడుకోవడాలు లేవని స్పష్టం చేశారు..

    ఉత్తర కొరియా అదినేత కిమ్ జోంగ్ ఉన్.. ఈ పేరు వింటేనే కొందరు వణుకుతారు. ప్రస్తుతం ఉన్న పాలకుల్లో నియంతగా ముద్ర వేసుకున్న కిమ్ తన చేష్టలు కూడా అలానే ఉంటాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాతో కూడా యుద్దానికి కాలుదువ్వుతూనే ఉంటారు. అయితే ఇటీవల అమెరికాతో సంప్రదింపులు లేదా ఘర్షణకైనా సిద్ధంగా ఉండాలని కిమ్‌జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయని అమెరికా పేర్కొంది. దీనిపై తాజాగా కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ (Kim Yo Jong) మరింత ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు అమెరికాకు.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అమెరికాతో సంప్రదింపులు పునరుద్ధరించే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.

    అమెరికా ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలకు తావులేదని ఆమె స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయంటూ అమెరికా లెక్కలు వేసుకుంటున్నా.. వారిని మరింత నిరాశకు గురిచేస్తాయని అభిప్రాయపడ్డారు. ఉత్తర కొరియా వ్యవహారాలను పర్యవేక్షించే అమెరికా దౌత్యవేత్త సంగ్‌ కిమ్‌, దక్షిణ కొరియాలో పర్యటిస్తోన్న నేపథ్యంలో కిమ్‌ సోదరి ఈ విధంగా స్పందించినట్లు అక్కడి అధికారిక వార్తా సంస్థ KCNA వెల్లడించింది.

    అమెరికా కొత్త ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ చర్చలకైనా.. ఘర్షణకైనా సిద్ధంగా ఉండాలి అని తన సైన్యానికి కిమ్‌జోంగ్‌ ఉన్‌ ఈమధ్యే సూచించారు. దీనిపై స్పందించిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలైవాన్‌, కిమ్‌ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయన్నారు. అయితే వీటిపై మరింత స్పష్టమైన సంకేతాలు వచ్చేవరకు వేచిచూస్తామని.. తాము మాత్రం ఉత్తర కొరియాతో చర్చలకు సిద్ధంగానే ఉన్నామని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా నుంచి సానుకూల ప్రకటన వస్తుందని అమెరికా భావించింది. కానీ, ఉత్తరకొరియా నియంత సోదరి మాత్రం చర్చల పునరుద్ధరణకు తావులేదని స్పష్టం చేశారు.

    అమెరికాలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కిమ్‌ సర్కారు మాత్రం ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా అణుపరీక్షల సామర్థ్యాన్ని పెంచుతామని ఉత్తర కొరియా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కొరియాతో అమెరికా చేస్తోన్న సైనిక విన్యాసాలు, శత్రువిధానాలను విడిచిపెట్టడంపైనే అమెరికాతో దౌత్య, ద్వైపాక్షిక సంబంధాలు ఆధారపడి ఉంటాయని తేల్చి చెబుతోంది.

    మరోవైపు ఆరోగ్య సంస్థకు ఇచ్చిన నివేదికలో ఉత్తర కొరియా కీలక వ్యాఖ్యలు చేసింది.  తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదని స్పష్టం చేసింది. ప్రపంచమంతా ఏడాదిన్నర కాలంగా కరోనాతో వణికిపోతుంటే..  ఉత్తర కొరియాలో కరోనా లేదంటున్నారు ఆ దేశ అధ్యక్షడు. జూన్ 10న 30 వేల మంది నుంచి నమూనాలు సేకరిస్తే ఒక్కరికి కూడా పాజిటివ్ లేదన్నారు కిమ్..
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Kim jong un, North Korea, USA

    తదుపరి వార్తలు