Coronavirus : ఉత్తర కొరియా అధినేత కిమ్‌కు కరోనా వైరస్ సోకాలా? ఆ నెటిజన్ల కోరిక

Coronavirus | Covid 2019 : కరోనా వైరస్ వచ్చినట్లు అనుమానం ఉన్న ఓ వ్యక్తిని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కాల్చి చంపించడం కలకలం రేపుతోంది.

news18-telugu
Updated: February 14, 2020, 3:02 PM IST
Coronavirus : ఉత్తర కొరియా అధినేత కిమ్‌కు కరోనా వైరస్ సోకాలా? ఆ నెటిజన్ల కోరిక
కిమ్ జోంగ్ ఉన్ (File)
  • Share this:
Coronavirus | Covid 2019 : ఏ దేశంలోనైనా కరోనా వ్యాధి సోకితే... నివారణ కోసం ట్రీట్‌మెంట్ ఇస్తారు. ఉత్తర కొరియాలో అలా కాదు కాల్చి చంపుతారు. మరీ దారుణమేంటంటే... అసలా వ్యక్తికి కరోనా వైరస్ (కోవిడ్ 19) సోకిందన్న గ్యారెంటీ కూడా లేదు. జస్ట్ సోకి ఉండొచ్చని అనుమానం మాత్రమే ఉంది. అంతలోనే అతన్ని కాల్చి చంపేశారు అక్కడి అధికారులు. ఇంత దారుణమా? అతనికి జాలి, దయ, మానవత్వం అన్నవే లేవా అంటూ ప్రపంచ దేశాలు... కిమ్ జోంగ్ ఉన్‌పై మండిపడుతున్నా్రు. జనరల్‌గా కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఉత్తర కొరియాలో మాత్రం కరోనా వైరస్‌ని భయపెడుతున్నాడు కిమ్. అసలేం జరిగిందంటే... ఉత్తర కొరియాకు చెందిన ఓ అధికారియ.. చైనాలో టూర్‌ ముగించుకుని... స్వదేశానికి వచ్చాడు. జనరల్‌గా చైనా నుంచీ వచ్చే వారికి కరోనా వ్యాధి సోకుతోంది కదా... అతనికి కూడా సోకి ఉంటుందని అనుమానించారు. దానికి తోడు అతను దగ్గుతున్నాడు. అలా దగ్గినప్పుడల్లా... అధికారులు చాలా టెన్షన్ పడుతూ... అతనికి కరోనా సోకి ఉండొచ్చని నానా యాగీ చేశారు. అతన్ని దగ్గరకు రావొద్దంటూ కండీషన్లు పెట్టారు. అంతలోనే ప్రత్యేక టీం కూడా అతనిపై నిఘా పెట్టింది.

ఏవరైనా స్వేచ్ఛ లేకుండా, కండీషన్ల మధ్య బతకాలంటే కష్టమే. ఆ అధికారి కూడా... రూల్స్ అతిక్రమించి... ఓ పబ్లిక్ టాయిలెట్‌కి వెళ్లాడు. దాంతో... అతను రూల్స్ అతిక్రమించాడని పై అధికారులకు తెలిసింది. అతన్ని కాల్చి చంపమని పై నుంచీ ఆర్డర్లు వచ్చాయి. వెంటనే పోలీసులు గన్స్ చేతపట్టారు. ప్రత్యేక కరోనా వైరస్ సోకని సూట్లు వేసుకొని... అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత కాల్చి చంపారు. అంతే కాదు... ఈ ఫైరింగ్ తర్వాత తమ దేశంలో ఎవరికీ కరోనా వైరస్ సోకలేదనీ, సోకకుండా ఉండేందుకే అతన్ని చంపేశామని ప్రకటించారు.

ఈ ఫైరింగ్ ఘటన తర్వాత... చైనా నుంచీ ఉత్తర కొరియాకు వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. కరోనా వచ్చినట్లు అనుమానం ఉంటేనే ఇలా చంపేశారే... ఇక ఎవరికైనా కరోనా వస్తే... వాళ్లను ఇంకెంత తీవ్రంగా చంపుతారో అని భయపడుతున్నారు. ఇక తాజాగా ఉత్తర కొరియా... చైనా నుంచీ రాకపోకల్ని పూర్తిగా కంట్రోల్‌లో పెట్టుకుంది. చైనా బోర్డర్‌ను మూసేసింది. అంతేకాదు... ఎవరైనా చైనాకు వెళ్తే... కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చింది. దాంతో... నార్త్ కొరియా నుంచీ చైనాకు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించట్లేదు.

కిమ్ జోంగ్ ఉన్ చర్యను ప్రపంచ దేశాలు కండిస్తున్నాయి. వైరస్ సోకితే... ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందించాలి గానీ ఇలా చంపేస్తారా అని ప్రశ్నిస్తున్నాయి. చైనా కూడా ఇలాగే చేసి ఉంటే... ఏం జరిగేది? అసలు ఇలా ఏ దేశమైనా చేస్తుందా? ఆ కరోనా వైరస్సేదో కిమ్‌కే వస్తే బాగుండు అంటున్నారు నెటిజన్లు. ఐతే... ఉత్తర కొరియా ప్రభుత్వం చెప్పింది నిజం కాదనీ... ఆ దేశంలో కూడా కరోనా వైరస్ సోకిన వాళ్లు కొంత మంది ఆల్రెడీ చనిపోయారని దక్షిణ కొరియాకు చెందిన డాంగ్ ఆ ఇల్బో పత్రిక చెబుతోంది.
Published by: Krishna Kumar N
First published: February 14, 2020, 10:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading