PM Narendra Modi Speech: దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇవ్వబోయే సందేశం ఇదేనా..

PM Narendra Modi Speech: కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో.. ప్రజలు కూడా కరోనా విషయాన్ని తేలికగా తీసుకోవడం మొదలుపెట్టారనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది.

news18-telugu
Updated: October 20, 2020, 3:39 PM IST
PM Narendra Modi Speech: దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇవ్వబోయే సందేశం ఇదేనా..
ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రధాని నరేంద్రమోదీ మళ్లీ ప్రజలకు సందేశం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ప్రజలకు అనేకసార్లు సందేశమిచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. కరోనా విషయంలో జాగ్రత్తలు సూచించడంతో పాటు దేశ ఆర్థికస్థితిని మళ్లీ గాడిలో పెట్టేందుకు పలు కీలక ప్రకటనలు చేశారు. ఆ తరువాత అన్‌లాక్‌ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కూడా ప్రజలకు సందేశం ఇచ్చారు ప్రధాని మోదీ. అయితే ఈసారి ప్రధాని మోదీ ప్రజల ముందుకు వచ్చి ఏం చెప్పబోతున్నారనే దానిపై మాత్రం అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆయన ఏం చెబుతారనే అంశంపై ఎవరికీ పెద్దగా క్లారిటీ లేకపోయినప్పటికీ.. కరోనా విషయంలోనే ఆయన మరిన్ని జాగ్రత్తలు సూచిస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో.. ప్రజలు కూడా కరోనా విషయాన్ని తేలికగా తీసుకోవడం మొదలుపెట్టారనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా రాబోయే దసరా, దీపావళి వంటి పండగల సీజన్ కావడంతో.. కరోనా విషయంలో నిర్లక్ష్యం పనికిరాదనే సందేశాన్ని ప్రధాని మోదీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

దీంతో పాటు కరోనా వ్యాక్సిన్ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే అంశంపై కూడా ప్రధాని మోదీ ప్రసంగంతో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఇటీవల దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఏ విధంగా జరగాలనే దానిపై ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన కరోనా వ్యాక్సిన్ ఎప్పటిలోగా అందుబాటులోకి రావొచ్చనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వొచ్చని తెలుస్తోంది.

ఇక కరోనా విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే పండగల సీజన్‌లో ఒక్క నెలలోనే 26 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు సందేశం ఇచ్చేందుకు సిద్ధం కావడంతో... ఆయన ఈ అంశాలనే ఎక్కువగా ప్రస్తావించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
Published by: Kishore Akkaladevi
First published: October 20, 2020, 3:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading