• Home
  • »
  • News
  • »
  • coronavirus-latest-news
  • »
  • KERALA SREE PADMANABHASWAMY TEMPLE CLOSES FOR DEVOTEES TILL OCTOBER 15 AFTER CHIEF PRIEST AND 11 OTHERS TESTS CORONAVIRUS POSITVE SU

Sree Padmanabhaswamy Temple: అక్టోబర్ 15 వరకు పద్మనాభస్వామి ఆలయం మూసివేత

శ్రీ పద్మనాభస్వామి ఆలయం(ఫైల్ ఫొటో)

కేరళ తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో కరోనా కలకలం రేపింది. ఆలయ ప్రధాన అర్చకుడు పెరియనంబితో పాటుగా మొత్తం 12 మందికి కరోనా సోకడంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

  • Share this:
    కేరళ తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో కరోనా కలకలం రేపింది. ఆలయ ప్రధాన అర్చకుడు పెరియనంబితో పాటుగా మొత్తం 12 మందికి కరోనా సోకడంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అక్టోబర్ 15 వరకు ఆలయంలో భక్తుల ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తున్నట్టు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి రతీషన్ తెలిపారు. ఆలయం మూసివేసిన సమయంలో కేవలం భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించమని.. రోజువారి కార్యక్రమాలు యథావిథిగా కొనసాగుతాయని చెప్పారు.

    ప్రధాన అర్చకుడికి కరోనా సోకిన నేపథ్యంలో ఆయన స్థానంలో రోజువారి పూజ కార్యక్రమాలను తంత్రీ శరణానెల్లూర్ సతీసన్ నంబూతిరిపాడ్ చూసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఇక, కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 21న పద్మనాభస్వామి ఆలయాన్ని మూసివేశారు. అయితే అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా ప్రకటించిన సడలింపుల్లో భాగంగా ఆగస్టు చివర్లో ఆలయాన్ని తెరిచారు. అప్పటి నుంచి కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఇక, తాజాగా ఆలయంలో కరోనా కలకలం చోటుచేసుకోవడంతో అక్టోబర్ 15వరకు మూసివేస్తున్నారు.

    ఇక, కేరళలో ఇప్పటివరకు 2,58,850 కరోనా కేసులు నమోదు కాగా, 930 మంది మరణించారు. కరోనా సోకిన వారిలో 1,67,256 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కేరళలో 90,664 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published: